Kolkata Knight Riders Creates Sensational Record In IPL History: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సరికొత్త చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. ఆఖరి ఓవర్‌లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది. ఏప్రిల్ 9వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఆఖరి ఓవర్‌లో 29 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసి, కేకేఆర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. చివరి ఓవర్‌లో ఇంత భారీ టార్గెట్‌ని ఛేజ్ చేయడం.. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు 2016లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆఖరి ఓవర్‌లో 23 పరుగుల లక్ష్యాన్ని పుణే వారియర్స్ ఛేదించింది. ఈ ఐపీఎల్ సీజన్ వరకూ అదే హయ్యస్ట్ కాగా.. తాజా మ్యాచ్‌తో ఆ రికార్డ్‌ని కేకేఆర్ బద్దలుకొట్టింది. చివరి ఓవర్‌లో రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఐదు సిక్సులు బాదడం వల్లే.. కేకేఆర్ ఈ రికార్డ్‌ని తన పేరిట లిఖించుకుంది. ఇక మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్‌లో 22 పరుగుల టార్గెట్‌ను ఛేధించింది.
China Chickens Case: ఇదెక్కడి ప్రతీకారంరా నాయనా.. 1100 కోళ్లను భయపెట్టి..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (39), సాయి సుదర్శన్ (53)లు మొదట్లో అద్భుతంగా రాణించగా.. చివర్లో విజయ్ శంకర్ (24 బంతుల్లో 63) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటం వల్లే.. గుజరాత్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కి ఆరంభంలో ఝలక్ తగిలింది. ఓపెనర్ల వికెట్లను వెనువెంటనే కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (83), నితీశ్ రానా (45) విజృంభించారు. మూడో వికెట్‌కు వీళ్లిద్దరు కలిసి ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక కేకేఆర్‌దే విజయం అనుకున్న టైంలో.. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 19 ఓవర్లు ముగిసేసరికి.. కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది. ఆఖరి ఓవర్‌లో 29 పరుగులు చేయాల్సి ఉండగా.. విజయం గుజరాత్‌దేనని అనుకున్నారు. కానీ.. ఎవరూ ఊహించని విధంగా రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్స్‌లు బాది, తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు.
Yash Dayal: యశ్ దయాల్ చెత్త రికార్డ్.. ఐపీఎల్‌లో రెండో బౌలర్‌గా..