సన్ రైజర్స్ హైదరాబాద్.. సరైన ఇంపాక్ట్ ప్లేయర్ కోసం చూస్తున్నారా మా ధరణి బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టి ఫుల్లు ఫామ్ లో ఉన్నాడు అంటూ ఈ ప్రోమోకి క్యాప్షని ఎస్ఎల్ వీ సినమాస్ జోడించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా దారుణమైన బ్యాటింగ్ వైఫల్యంతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు అతడు నిరాశే మిగులుస్తున్నాడు. ఇదే ఆట తీరును అతడు కొనసాగిస్తే భారత జట్టులో కాదు.. కదా.. ముంబై దేశవాళీ జట్టులో కూడా చోటు దక్కడం కష్టమని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
రహానేకు వెళ్లి ఎంజాయ్ చేయమని చెప్పాను, ఒత్తిడి తీసుకోకండి మరియు మేము మీకు మద్దతు ఇస్తాము. అతను బాగా బ్యాటింగ్ చేసాడు మరియు అతను ఔట్ అయిన విధానంతో అతను సంతోషంగా లేడని ధోని తెలిపాడు. నేను ప్రతి గేమ్ ముఖ్యమని భావిస్తున్నాను, మీరు చూడండి మీ ముందున్న సమస్యలపై ఒక అడుగు వేయండి.. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికను చూడకండి అని ధోని చెప్పుకొచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. వారు బాగా బౌలింగ్ చేసి మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అటువంటి బౌలర్లపై ఎదురుదాడికి దిగాలంటే చాలా ధైర్యం కావాలన్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ మారినా తలరాత మారడం లేదు. వేలంలో సైతం పెద్ద ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో యాజమాన్యం చేసిన తప్పులే ఇప్పుడు వరుసగా ఓటములకు కారణాలు అని చెప్పాలి. ఇక ఈ రోజు జరుగనున్న మ్యాచ్ లో మొదటి విజయం కోసం మార్క్రమ్ సేన బరిలోకి దిగుతుంది.
సీఎస్కే చేతిలో ఘోర ఓటమిని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగానే రోహిత్ తన క్యాప్ తో ముఖం దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 158 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన ధోనీ సేన 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. బ్యాటింగ్ దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది.