ఐపీఎల్-16 మొదలై పది రోజులు కావస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ లీగ్ అభిమానుల అటెన్షన్ ను తమ వైపునకు తిప్పుకుంటుంది. సాధారణంగా వన్ సైడ్ మ్యాచ్ ల కంటే అభిమానులు ఉత్కంఠగా సాగుతూ చివరి వరకూ విజయం నీదా నాదా అన్నట్లుగా సాగే మ్యాచ్ లనే ఇష్టపడతారు. అవి లో స్కోరింగ్ థ్రిల్లర్ లు అయినా హై స్కోరింగ్ గేమ్స్ అయినా విజయం ఇరు జట్ల మధ్య దోబూచూలాడాలి.. అప్పుడే ఆటకు అందం.. చూసే వాళ్లకు ఆనందం.. సరిగ్గా ఆదివారం గుజరాత్ టైటాన్స్ కోల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ ఇలాగే జరిగింది. ఈ సీజన్ లో 200+ టార్గెట్ చేసిన గుజరాత్ ఓడిపోవడం ఇదే తొలి సారీ. ఇంత భారీ స్కోర్ చేసినా ఛేజింగ్ చేసి గెలవడమూ కోల్ కతా కు ఇదే తొలిసారి.
Watching this on L➅➅➅➅➅P… and we still can't believe what we just witnessed! 🤯pic.twitter.com/1tyryjm47W
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2023
Also Read : Ram Charan: ఆ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కి చరణ్ డాన్స్ ఆడితే రచ్చ రచ్చే
ఈ ఏడాది బీసీసీఐ ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కు ఈ మ్యాచ్ లో అసలైన న్యాయం జరిగింది. గడిచిన పదిరోజులుగా ఐపీఎల్ లో వివిధ జట్లు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను వాడుతున్నా.. సదరు ఆటగాళ్లు.. మ్యాచ్ మీద స్పష్టమైన ముద్ర వేయలేకపోయారు. కానీ.. ఈ మ్యాచ్ లో మాత్రం సుయాశ్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. గేమ్ మీద అసలైన ప్రభావం చూపాడు. రావడంతో సిక్సర్ బాది తన టార్గె్ట్ ఎంటో స్పష్టంగా అయ్యర్ చెప్పాడు. 40 బంతుల్లోనే 8 బౌండరీలు, 5 సిక్సులతో 83 పరుగులు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా వెంకటేశ్ అయ్యర్ నిలిచాడు.
Also Read : Summer Effect: ఏపీలో నేడు, రేపు వడగాల్పులు ..వాతావరణ శాఖ వార్నింగ్
కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా 17వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించాడు. ఐపీఎల్-16 సీజన్ లో ఇదే తొలి హ్యాట్రిక్. ఆ ఓవర్లో రషీద్ ఖాన్ వరుసగా రసెల్, నరైన్, శార్దూల్ ఠాకూర్ లను ఔట్ చేశాడు. గుజరాత్ తరపున ఐపీఎల్ లో హ్యాట్రిక్ చేసిన తొలి బౌలర్ కూడా రషీద్ ఖాన్ కావడం విశేషం. మొత్తంగా టీ20 క్రికెట్ లో అతడికి ఇది నాలుగో హ్యాట్రిక్.. అంతకు ముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, ఒక అంతర్జతీయ టీ20 హ్యాట్రిక్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అతడు 3 హ్యాట్రిక్ లు తీసిన ఆండ్రూ టై, మహ్మద్ సమీ, అమిత్ మిశ్రా, ఆండ్రూ రసెల్, ఇమ్రాన్ తాహిర్ లను అధిగమించాడు. ఐపీఎల్ లో కేకేఆర్ పై హ్యాట్రిక్ పడగొట్టిన నాలుగో బౌలర్ రషీద్. గతంలో ముఖయా ఎన్తిని, ప్రవీణ్ తాంబే, యుజ్వేంద్ర చహల్ లు కూడా హ్యాట్రిక్ తీశారు.
Also Read : Jail Restaurant: బెంగళూరులో సెంట్రల్ జైల్ రెస్టారెంట్.. ప్రత్యేక ఏంటో తెలుసా ?
ఈ మ్యాచ్లో అసలు గెలుపు మీదు కేకేఆర్ కు ఆశలే లేవు కానీ.. అనూహ్య విజయం సాధించిందంటే దానికి కారణం వెంకటేశ్ అయ్యర్ ఇన్సింగ్స్ తో పాటు రింకూ సింగ్ ది. చివరి ఓవర్ లో రింకూ సింగ్ ఐదు భారీ సిక్సులతో దుమ్మురేపాడు. ఇలా చేసిన బ్యాటర్ల జాబితాలో ఆరో వాడు. గతంలో క్రిస్ గేల్ ( 2012), రాహుల్ తెవాటియా ( 2020), రవీంద్ర జడేజా ( 2021), మార్కస్ స్టోయినిస్ ( 2022) లు రింకూ సింగ్కంటే ముందున్నారు. ఐపీఎల్ చివర్ లో అత్యధిక పరుగులు ఛేధించిన జట్టు కేకేఆర్ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్.. 5 బంతుల్లో 30పరుగులు సాధించాడు.