గుజరాత్ టైటాన్స్ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆ టీమ్ సారథి హార్థిక్ పాండ్యా మాత్రం తీవ్ర నిరాపరుస్తున్నాడు. గతేడాది అద్భుతంగా రాణించిన హార్థిక్.. ఈ సీజన్ లో మాత్రం బ్యాటింగ్-బౌలింగ్ లో దారుణంగా విఫలమవుతున్నాడు.
ఐపీఎల్ లో చరిత్రలో ఏ ఆటగాడు కూడా చివర్లో ధోని కొట్టినన్ని సిక్సర్లు కొట్టలేదు. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఇన్సింగ్స్ చివరి ఓవర్ లో రికార్డు స్థాయిలో 57 సిక్సర్లు బాదాడు.
ఐపీఎల్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్ ను ఢీ కొట్టేందుకు ధావన్ సేన సన్నదమవుతుంది. పవర్ హిట్టర్.. ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్ స్టోన్ రాకతో పంజాబ్ కింగ్స్ లో జోష్ వచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో టాప్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కొనసాగుతుండగా.. మ్యాచ్ ను ఏ మాత్రమ చేజార్చుకునేందుకు ఇష్టపడని తత్వం గుజరాత్ టైటాన్స్ ది. శిఖర్ ధావన్ వర్సెస్ హార్థిక్ పాండ్యా మధ్య జరిగే ఈ ఉత్కంఠ భరిత పోరులో ఎవరినీ విజయం వరిస్తోందో చూడాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే..
ధోని బ్యాటింగ్ కు రాగానే జియో సినిమా వ్యూస్ 2 కోట్ల మార్క్ ను దాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్ లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు ఆల్ టైమ్ రికార్డు. ధోని బ్యాటింగ్ కు ముందు 60 లక్షల వ్యూస్ ఉండగా.. అతను రాగానే మరో 60 లక్షల వ్యూస్ అమాంతరం పెరిగాయి.