పేరులో అక్షరం చేరిస్తే జీవితం మారిపోతుందని అనుకుంటారు చాలా మంది. మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పేరులో ఓ K ఎక్కువగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ 33, జెర్సీ 10 నెంబర్లకు, ధోని 7 నెంబర్ జెర్సీ వెనక చాలా పెద్ద సెంటిమెంట్స్ ఉన్నాయి. క్రికెటర్లు కూడా సంఖ్యా శాస్త్రంను బాగా నమ్ముతారు. రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా వంటి ప్లేయర్లు కూడా న్యూమారాలిజిస్టులు చెప్పినట్లుగానే జెర్సీ నెంబర్లను ఎంచుకున్నారు. వ్యక్తిగత జీవితంలో చేసే చాలా పనుల విషయంలో కూడా వీరీ జోక్యం ఉంటుంది. పలానా నెంబర్ తో కార్లను కొనడం, ఇంటి నెంబర్, పెళ్లిళ్లు, పూజలు, శుభకార్యాలు.. అన్నింటికి న్యూమారాలజీ ఎక్స్ పర్ట్స్ జోక్యం ఉంటుంది.
Also Read : Director Maruthi: మేం కోరుకుంటోంది ఇది కాదంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!
మరి న్యూమరాలజీ ప్రకారం ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఏవో తెలుసా.. ప్రముఖ న్యూమరాలజిస్ట్ అంచనా ప్రకారం ఈ సారి ప్లే ఆఫ్స్.. ఫైనల్స్ కి చేరబోయే జట్లు ఇవేనంటా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్.. అని చెప్పారు. 2023లో అంకెలన్నీ కలిపితే వచ్చేది.. 7 సంఖ్యా శాస్త్రంలో 7 అంకె, నీలం రంగును సూచిస్తుంది. కాబట్టి బ్లూ జెర్సీని ధరించే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కి.. ఫైనల్ కి చేరేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఇందులో మొదటి రెండు మ్యాచ్ ల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఓటమిని చవిచూసింది.
తొలి విజయం కోసం ఎదురుచూస్తుంది.
Also Read : Clash: ‘బలగం’ సినిమా ప్రదర్శన వద్ద యువకుల ఘర్షణ.. ఓ వ్యక్తి దుర్మరణం
ముంబై ఇండియన్స్ మాదిరిగానే లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈసారి బ్లూ కలర్ జెర్సీలో బరిలో దిగుతోంది. కాబట్టి లక్నో టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ లో రిషబ్ పంత్ లేకపోవడంతో మిచెల్ మార్ష్ అతని స్థానంలో వచ్చాడు. మిచెల్ మార్ష్ పెళ్లి కోసం స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడం,, కీలక బ్యాటర్లు ఫెయి్ల అవుతుండడంతో మొదటి మూడు మ్యాచ్ ల్లో ఓడింది. అయితే న్యూమరాలజీ ప్రకారం ఈ సారి కచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరుతుందని చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ప్లే ఆఫ్స్ కు చేరే ఛాన్స్ ఉందని సంఖ్యా శాస్త్ర నిపుణులు అంటున్నారు.
Also Read : Minister Niranjan Reddy: జూపల్లి, పొంగులేటిపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు..
ఐపీఎల్ 2023 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్.. మొదటి 3 మ్యాచ్ ల్లో 2 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్నాయి. అయితే న్యూమరాలజీ ప్రకారం వీటిలో ఏ టీమ్ కూడా ప్లే ఆఫ్స్ చేరదట.. ఇందులో ఇంకో విశేషం ఉంది. న్యూమరాలజీ ఎక్స్ పర్ట్.. ఈ సారి పక్కా ప్లే ఆఫ్స్ చేరతాయని అంచనా వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంటే.. ముంబై ఇండియన్స్ లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆర్సీబీ ఇక చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ మాత్రమే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.