ఐపీఎల్ 2023లో ఎస్ ఆర్ హెచ్ టీమ్ ఎట్టకేలకు తొలి విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి ( 74 నాటౌట్ ) పరుగులతో అద్భుత ఇన్సింగ్స్ ఆడగా.. కెప్టెన్ మార్ర్కమ్ ( 37 నాటౌట్ ) రాణించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 66 బంతుల్లో 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు.
https://twitter.com/BabarFanGirl56/status/1645106293194264576
Also Read : Kavya Maran : సన్ రైజర్స్ గెలిచింది.. కావ్య పాప నవ్విందిరోచ్చ్..
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు.. జానెసన్, భువీ చెరో వికెట్ తీసుకున్నారు. అయితే ఎస్ ఆర్ హెచ్ తలరాత మారినప్పటికీ.. ఆ టీమ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఆట మాత్రం మారడం లేదు. మరోసారి బ్రూక్ దారుణ ప్రదర్శనతో విఫలమయ్యాడు. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన బ్రూక్ 14 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అర్షదీప్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడిన అతడు కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. కాగా ఏడాది సీజన్ కు ముందు జరిగిన మినీ వేలంలో హ్యారీ బ్రూక్ ను రూ. 13.25 కోట్లు పెట్టి మరీ సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఇక ఇంత భారీ మొత్తం తీసుకుని మరి దారుణంగా విఫలమవుతున్న బ్రూక్ ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నీవు ఇక మారవా..13 కోట్లు తీసుకున్నావు.. ఇదే నా నీ ఆట అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Also Read : Shikar Dhawan: థాంక్యూ హైదరాబాద్.. విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్
