ఐపీఎల్ 2023లో సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దీంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)ని బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే.. మార్క్ వుడ్ LSG కి తిరిగి వచ్చినందున రెండు జట్లు కొన్ని మార్పులు చేసాయి. బెంగుళూరు జట్టు తమ బౌలింగ్‌ను బలోపేతం చేసుకునేందుకు వేన్ పార్నెల్‌కు అవకాశం కల్పించింది. ఈ సీజన్‌ను సంచలనాత్మకంగా ప్రారంభించిన RCB.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: డు ప్లెసిస్ (C), విరాట్ కోహ్లి, ఎం లోమ్రోర్, మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (WK), ఎస్ అహ్మద్, ఎ రావత్, హెచ్ పటేల్, డి విల్లీ, సిరాజ్, పార్నెల్.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు: KL రాహుల్ (C), K మేయర్స్, N పూరన్ (WK), దీపక్ హుడా, స్టోయినిస్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, ఏ, ఖాన్, ఉనద్కట్, మార్క్ వుడ్.