బ్రెట్ లీ ముంబై వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న టైంలో ఇద్దరు యువకులు అతన్నీ స్కూటర్ పై వెంబడించారు. సార్ మేము మీకు పెద్ద అభిమానులం అని పదేపదే అరుస్తూ సెల్ఫీ దిగేందుకు అవకాశం ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. కొద్దిదూరం పాటు బ్రెట్ లీ కారు వెంట వారు స్కూటర్ పై ఫాలో అయ్యారు.
నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి నా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కొన్ని కారణాల వల్ల వాళ్లు వెళ్లిపోయారు. కానీ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. నా ఇన్సింగ్స్ ను బాగా ఎంజాయ్ చేసింది. ఈ రోజు నా ప్రదర్శనపై ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని భావిస్తున్నా అంటూ హ్యారీ బ్రూక్ తెలిపాడు.
పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే పాండ్యా ఆనందం కాసేపైనా లేకుండా పోయింది. నిర్ణీత టైంలో ఇన్సింగ్స్ ను పూర్తి చేయని కెప్టెన్ లకు ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానాలు విధిస్తున్నారు.
కెప్టెన్ మార్ర్కమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్ కు గత రెండు మ్యాచ్ లలో విజయాలు అందించిన శార్థూల్ ఠాకూర్, రింకూ సింగ్ లను చూసి తామేమీ భయపడటం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు.
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సెషన్ లో బెన్ స్టోక్స్ బొటనవేలికి గాయమైంది. దీంతో అతను తర్వాత మ్యాచ్ లకు దూరమయ్యాడు. కాగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్ ను మేం ముందే ఫినిష్ చేస్తే బాగుండేది.. కానీ ఆఖరి ఓవర్ వరకు తీసుకొచ్చాం.. నాకు మ్యా్చ్ లు ఇలా చివరి ఓవర్ వరకూ రావడం పెద్దగా నచ్చవు అని హార్థిక్ పాండ్యా చెప్పాడు.
ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీ కొట్టబోతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గెర్డెన్స్ వేదికగా ఎస్ ఆర్ హెచ్ తలపడనుంది.