ఐపీఎల్ 2023 సీజన్ లో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆఖరి బంతి వరకు నువ్వా-నేనా అన్న రీతిలో తలపడుతున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారో అంచనా వేయడం సాధ్యం కావడం లేదు. బ్యాటర్లు విరుచుకుపడుతుండడంతో ఆఖరి ఓవర్ లో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి, ఫీల్డింగ్ ఎక్కడ సెట్ చేసుకోవాలన్న దానిపై ఆయా జట్ల కెప్టెన్లు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో సమయం వెస్ట్ అవుతుంది. మూడు గంటల్లో ముగియాల్సిన మ్యాచ్ లు కాస్త ఆలస్యమవుతున్నాయి. దీంతో నిర్ణీత టైంలో ఇన్సింగ్స్ ను పూర్తి చేయని కెప్టెన్ లకు ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. గురువారం జరిగిన పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే పాండ్యా ఆనందం కాసేపైనా లేకుండా పోయింది.
Read Also : Ukraine War: వీకిపీడియాకు మాస్కో కోర్టు షాక్.. ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు జరిమానా
మ్యాచ్ స్లో ఓవర్ రేటు కారణంగా హార్థిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో రూ. 12లక్షల జరిమానా విధించారు. స్లో ఓవర్ రేటుకు సంబంధించి ఐపీఎల్ పరివర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్ లో తొలిసారి గుజరాత్ టైటాన్స్ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఆ జట్టు కెప్టెన్ అయిన హార్థిక్ పాండ్యాకు.. రూ. 12 లక్షల ఫైన్ విధించినట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. రెండోసారి కూడా ఇలాగే జరిగితే అప్పుడు జరిమానా మొత్తం రూ. 24 లక్షలకు పెరుగనుంది. అంతేకాదు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో రూ. 6లక్షలు లేదా 24 శాతం వరకు జరిమానా పడొచ్చు. మూడోసారి కూడా ఇలాగే జరిగితే కెప్టెన్ ఓ మ్యాచ్ నిషేదాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. జట్టులోని మిగిలిన ప్లేయర్స్ కు రూ.12 లక్షల లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తారు. ఈ సీజన్ లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా పడిన మూడో కెప్టున్ పాండ్యా నిలిచాడు. ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ లకు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా పడింది.
Read Also : Viral : బాల బాహుబలి.. కండలు చూసి కంగుతినకండి
