ఇండియన్ ప్రీమియర్ లీగ్2023 ఎడిషన్ 16లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిశాడు. ఈ సీజన్ లో తొలి సెంచరీ బ్రూక్ దే. ఇక 55 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో వంద పరుగుల మార్క్ ను అందుకున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడినప్పటికి పేసర్ల బౌలింగ్ లో మాత్రం దుమ్మురేపాడు. ఇటు హ్యారీ బ్రూక్ బ్యాటింగి చేస్తుంటే డగౌట్ నుంచి అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం చప్పట్లతో అభినందించడం ఇప్పుడు వైరల్ మా మారింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్సింగ్స్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. స్పిన్ ఆడడంలో కొంత ఇబ్బంది పడ్డను కానీ.. పవర్ ప్లేలో వీలైనంత మేర పరుగులు కొట్టేందుకు ప్రయత్నం చేసినట్లు బ్రూక్ తెలిపాడు.
Read Also : SRH vs KKR: కేకేఆర్‌పై సన్‌రైజర్స్ ఘనవిజయం.. బాగానే పోరాడారు కానీ..
ఒక వైపు బ్రూక్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తుంటే అతనికి తోడుగా కెప్టెన్ మార్ర్కమ్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. మార్ర్కమ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ.. కిరాక్ బ్యాటింగ్ తో 17 బంతుల్లోనే 32 పరుగులు చేసి కీలకమైన పరుగులు రాబట్టాడు. వాళ్లు అవుటైన తర్వాత ఆ బాధ్యతలను నేను తీసుకున్నా.. బాగా ఆడాలని మాత్రమే అనుకున్నా.. కానీ ఇలా సెంచరీ చేస్తానని ఊహించలేదు అని హ్యారీ బ్రూక్ అన్నాడు. నా వంతు పోషించాను అని వెల్లడించాడు. నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి నా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కొన్ని కారణాల వల్ల వాళ్లు వెళ్లిపోయారు. కానీ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. నా ఇన్సింగ్స్ ను బాగా ఎంజాయ్ చేసింది. ఈ రోజు నా ప్రదర్శనపై ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని భావిస్తున్నా అంటూ హ్యారీ బ్రూక్ తెలిపాడు.
Read Also : Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి రెబెల్స్ తలనొప్పి.. అసమ్మతిని తగ్గించేదెలా?
