క్రికెట్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ గురించి తెలిసే ఉంటుంది. తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను పెవిలియన్ బాటపడ్డించడంలో బ్రెట్ లీ దిట్టా.. భారత్ లో బ్రెట్ లీకి భారీగానే ఫాలోయింగ్ ఉంది. అతను అన్ని ఫార్మాట్లనుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఐపీఎల్ 2023లో ఇంగ్లీష్ వ్యాఖ్యాత ప్యానెల్ లో ఉన్నారు. అయితే ఇటీవల బ్రెట్ లీ ముంబై వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న టైంలో ఇద్దరు యువకులు అతన్నీ స్కూటర్ పై వెంబడించారు.
India is always full of wonderful surprises! Love the passion 🙏🏻🇮🇳 #wearalid boys ⛑️ pic.twitter.com/gTDv8O4AmK
— @BrettLee_58 (@BrettLee_58) April 12, 2023
Read Also : Jess Jonassen: బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్
ముంబై వీధుల్లో యువకులు వెంబడించిన వీడియోను బ్రెట్ లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి క్యాప్షన్ గా.. భారతదేశం ఎప్పుడూ అద్భుతమైన ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది.. అభిరుచిని ప్రేమించండి #wearalid అబ్బాయిలు అంటూ పేర్కొన్నాడు. అయితే బ్రెట్ లీ షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు యువకులు బ్రెట్ లీ కారులో వెళ్తుండగా గుర్తించి స్కూటర్ పై కారును ఫాలో అయ్యారు. సార్ మేము మీకు పెద్ద అభిమానులం అని పదేపదే అరుస్తూ సెల్ఫీ దిగేందుకు అవకాశం ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. కొద్దిదూరం పాటు బ్రెట్ లీ కారు వెంట వారు స్కూటర్ పై ఫాలో అయ్యారు. బ్రెట్ లీ మాత్రం.. ముందు మీరు హెల్మెట్ లు ధరించండి.. ప్రశాంతంగా వాహనం నడపండి అంటూ సూచించాడు.
Read Also : Kedar Jadhav : ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్..
కారులో వెళ్తుండగా ఇద్దరు అభిమానులు స్కూటర్ పై ఫాలో అయిన వీడియోను బ్రెట్ లీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియో షేర్ చేసిన ఒక్కరోజులోనే 3.2 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 9 వేలకు పైగా లైక్ లు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాల కామెంట్స్ తో నవ్వులు పూయిస్తున్నారు. హాహా వారికి బేసిక్స్ తెలియాలి.. బ్రెట్ లీకి ఎదురుగా మీరు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించడం అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు.