ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యా్చ్ లో గెలిచిన గుజరా్ టైటాన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. కోత్ కతా నైట్ రైడర్స్ తో ఓటమి తర్వాత పంజాబ్ పై ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్ నిర్థేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. అయితే గుజరాత్ సారథి హార్థిక్ పాండ్యాకు మాత్రం ఈ మ్యాచ్ ఇలా ముగియడం నచ్చేలేదని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పాండ్యా మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. వాస్తవంగా ఈ మ్యాచ్ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు.. దీని నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. మిడిల్ ఓవర్స్ లో మేం కొన్ని రిస్కీ షాట్స్ ఆడాం.. ఆటలో ఇటువంటివి సహజమే అయినా మేం మా తప్పును సరిదిద్దుకోవాలి.. మొహాలీ వంటి వికెట్ పై బౌలింగ్ చేయడం అంత సులువు కాదు.. కానీ మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు.. ఈ సీజన్ లో గుజరాత్ తరపున తొలి మ్యాచ్ ఆడిన మోహిత్ తన అనుభవన్నంతా ఉపయోగించి బాగా బౌలింగ్ చేశాడు.. వాస్తవానికి ఈ మ్యాచ్ ను మేం ముందే ఫినిష్ చేస్తే బాగుండేది.. కానీ ఆఖరి ఓవర్ వరకు తీసుకొచ్చాం.. నాకు మ్యా్చ్ లు ఇలా చివరి ఓవర్ వరకూ రావడం పెద్దగా నచ్చవు అని హార్థిక్ పాండ్యా చెప్పాడు.
Playing his first IPL since 2020, @gujarat_titans' Mohit Sharma dedicates his show to a very special person 🫶
𝘿𝙤 𝙣𝙤𝙩 𝙢𝙞𝙨𝙨 this wholesome conversation between @MdShami11 and #GT debutant Mohit Sharma 🤝
Full Interview 🎥🔽 #TATAIPL | #PBKSvGT https://t.co/P0Awmr0Sr3 pic.twitter.com/um1gpMbvSu
— IndianPremierLeague (@IPL) April 14, 2023
Read Also : Greed for wealth: భర్తను గొంతు కోసి హత్య చేసిన భార్య.. మే 2న కుమార్తె వివాహం
మోహిత్, అల్జారీ జోసెఫ్ లను ప్రత్యేకంగా ప్రశంసలను హార్థిక్ పాండ్యా కురుపించాడు. నెట్ బౌలర్ గా తమతో చేరిన అతడు అవకాశాల కోసం వేచి ఉండి అవకాశం వచ్చినప్పుడు చాలా చక్కగా వినియోగించుకున్నాడని చెప్పాడు. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన మోహిత్ కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. పంజాబ్ తో మ్యాచ్ మోహిత్.. 4 ఓవర్ లు వేసి 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ సారథి శిఖర్ ధావన్ తమ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తాము తప్పులను సరిదిద్దుకోవాలని అన్నాడు. ఈ మ్యాచ్ లో తాము 56 డాట్ బాల్స్ ఆడామని టీ20లలో ఇలా ఆడితే ఓడిపోకుంటే ఇంకేం చేస్తామని శిఖర్ ధావన్ చెప్పాడు. ఆరంభంలోనే వికెట్లను కోల్పోవడం మమ్మల్ని దెబ్బతీసిందని.. సన్ రైజర్స్ తో గత మ్యాచ్ లో ఇలాగే జరిగిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఆందోళన వ్యక్తం చేశాడు.
Read Also : Bloody Daddy: టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి… జాన్ విక్ అడప్షనా?
