IPL 2023 : కోల్ కతా నైట్‌రైడర్స్ ను ఢీ కొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీ కొట్టబోతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గెర్డెన్స్ వేదికగా ఎస్ ఆర్ హెచ్ తలపడనుంది. పంజాబ్ కింగ్స్ పై గెలిచి ఈ మెగా ఈవెంట్ లో బోణీ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆదే జోరును కేకేఆర్ పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ పలు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలమయిన ఇంగ్లండ్ పవర్ హిట్టర్ హ్యారీ బ్యూక్ ను పక్కన పెట్టాలని ఎస్ ఆర్ హెచ్ టీమ్ మెనెజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 13 కోట్లకు పైగా కొనుగోలు చేసిన బ్రూక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక అతడి స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గ్లెన్ పిలిప్స్ టీమ్ లోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో అభిషేక్ శర్మ రానున్నట్లు టాక్ వస్తోంది. గత నాలుగు మ్యాచుల్లో సుందర్ తన స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు.
Read Also : Dog Attack: వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కొరికిన పిట్‌బుల్.. విషమంగా బాధితుడి ఆరోగ్యం..
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఇక ఈ మ్యాచ్ లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ తో సన్ రైజర్స్ బరిలోకి దిగ సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్ అద్భుతమైన ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.. ఇక బౌలింగ్ పరంగా కూడా ఎస్ ఆర్ హెచ్ పటిష్టంగా ఉంది. ఉమ్రాన్ మాలిక్, భువీ, నటరాజన్ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు. మరోవైపు కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఒకే మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గుర్భాజ్ స్థానంలో జాసన్ రాయ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తోంది. ఇదే స్టేడియంలో కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్ లో కూడా భారీ స్కోర్ లు వచ్చే అవకాశం ఉంది. ఈ వికెట్ పై స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
Read Also : Prakash Ambedkar: హుజూరాబాద్ కు ప్రత్యేక చాపర్ లో బయలుదేరిన ప్రకాశ్ అంబేద్కర్
కోల్ కతా నైట్ రైడర్స్ : జాసన్ రాయ్, నారాయణ్ జగదీశన్ (WK), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా ( కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్థూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
సన్ రైజర్స్ హైదరాబాద్ : గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వా్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ ( కెప్టెన్ ), హెన్రిచ్ క్లాసెస్ ( వికెట్ కీపర్ ), అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్.

తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!