ఆడపిల్లలకు విద్య, క్రీడల్లో ప్రోత్సాహం కల్పిస్తూ వారికి క్రీడా రంగంలో కావాల్సిన మద్దతును అందివ్వడం ఈఎస్ఏ ప్రధాన ఉద్దేశం. ఈఎస్ఏ ఫౌండేషన్ డే ను పురస్కరించుకుని వారిలో స్పూర్తిని నింపేందుకు గాను ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఇవాళ ఈ జెర్సీతో బరిలోకి దిగనున్నారు.
షారూఖ్ ఖాన్ చేసింది 23 పరుగులే కావొచ్చు.. కానీ ఒత్తిడిలో అతను పంజాబ్ నె గెలిపంచిన విధానం సూపర్ అని చెప్పొచ్చు.. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్సింగ్స్ సమయంలో షారూఖ్ ఖాన్ రెండు స్టన్నింగ్ క్యాచ్ లతో మెరిశాడు.
IPL 2023 RCB Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్సీబీ) ఘన విజయం సాధించింది. 23 పరుగుల తేడాలో ఆర్సీబీ, డీసీని ఓడించింది. దీంతో ఐపీఎల్ 2023లో బెంగళూర్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి ఇన్సింగ్స్ లో ఆర్సీబీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని డీసీ ఛేదించలేకపోయింది. ఏ దశలోనూ ఢిల్లీ గెలుస్తుందనే ఆశ నెలకొనలేదు. వరసగా బ్యాటర్లు ఔట్ అవ్వడంతో కుదురుకునేవారు ఒక్కరూ లేకపోయారు.
JioCinema: ఐపీఎల్ హక్కలను సొంతం చేసుకున్న తర్వాత జియో సినిమా చాలా మందికి దగ్గరైంది. అయితే ఇప్పుడు జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ గా మార్చేందుకు రిలయన్స్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్ లను తన జియో సినిమా యాప్ లోకి తీసుకురావాలని అనుకుంటోంది.
ఐపీఎల్ లో మరో సూపర్ మ్యాచ్ కు అంతా రెడీ అయింది. లక్నో సూపర్ జెయింట్స్-పంజాబ్ కింగ్స్ జట్లు తలపడేందుకు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం జోరు మీదున్న లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కొంచెం తడబడిన పంజాబ్ ఐదో స్థానానికి పడిపోయింది.
ఎస్ ఆర్ హెచ్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ కు చుక్కలు చూపించాడు. 6వ ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో రాణా పరుగుల వరద పారించాడు. ఆ ఓవర్ లో 6 బౌండరీలు కొట్టాడు. అందులో రెండు సిక్స్ లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఈ ఓవర్ లో ఏకంగా ఉమ్రాన్ మాలిక్ 28 పరుగులు సమర్పించుకున్నాడు.
కేకేఆర్ బ్యాటింగ్ పవర్ ముందు మేము ఇచ్చిన టార్గెట్ చిన్నబోతుందని భావించాం.. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. భువీ తన అనుభవం మొత్తం చూపించాడు.. అదే విధంగా మాకు బ్యాటింగ్ లో అద్భుతమైన ఆరంభం లభించిందని మార్ర్కమ్ అన్నారు.