ఐపీఎల్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జూలు విదిల్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ డకౌట్‌గా వెనుతిరగడం, మరో ఓపెనర్ కోహ్లీ కూడా 25 పరుగులకే వెనుతిరగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. అటు మరో స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ కూడా 9 పరుగులకే…
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ మైదానంలో చిరుజల్లులు కురుస్తుండటంతో అంపైర్లు టాస్ ప్రక్రియను వాయిదా వేశారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు బెంగళూరు జట్టును కలవరపరుస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 ఐపీఎల్ సీజన్‌లు జరగ్గా.. ఆర్సీబీ ఏడు సార్లు ప్లేఆఫ్స్‌లో ఆడింది. కానీ కనీసం…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రికి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ గెలిస్తే ఫైనల్ చేరేందుకు సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నుంచి మ్యాచ్ విన్నింగ్ సెంచరీని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన…
ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్ క్రికెట్ అభిమానులకు మంచి మజా అందించింది. ఆడేది తొలి ఐపీఎల్ సీజన్ అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ ఐపీఎల్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 189 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ సాహా డకౌట్ కాగా శుభ్‌మన్ గిల్(35), మాథ్యూ వేడ్(35)…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు త్వరగా ఔటైనా బట్లర్ ఒక్కడే నిలబడ్డాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి చివర్లో ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్…
రాజస్థాన్ రాయల్స్ జట్టుపై టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో రాజస్థాన్ జట్టు వ్యూహాలను భజ్జీ మెచ్చుకున్నాడు. గతంలో ఏ జట్టు కూడా అశ్విన్‌ను ఉపయోగించుకోని రీతిలో రాజస్థాన్ జట్టు వాడుకుందని హర్భజన్ గుర్తుచేశాడు. అశ్విన్ ఆల్ రౌండర్ సామర్థ్యాలపై విశ్వాసం చూపినందుకు ప్రతిఫలంగా ఆ జట్టు ఎంతో మేలు పొందిందని కూడా తెలిపాడు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో బట్లర్‌తో పాటు అశ్విన్‌కు కూడా…
ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉన్నారు. వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు క్రేజ్ విపరీతంగా ఉంటోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఆ జట్టుకు క్రేజ్ అయితే తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్న టాప్-3 క్రీడా జట్టుల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు చోటు దక్కింది. ఏప్రిల్ 2022లో…
ఐపీఎల్-15 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్… తొలి క్వాలిఫయర్ ఆడనున్నాయి. ఇవాళ సాయంత్రం జరగబోయే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో… ఎవరు విజయం సాధించి… ఫైనల్‌కు చేరుకుంటారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. రెండు జట్లు… లీగ్‌లో అద్భుతంగా ఆడాయి. హర్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు లీగ్ ప్రారంభం నుంచి అద్భుత విజయాలతో నంబర్‌వన్ స్థానంలోకి దూసుకెళ్లింది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో…
1. ఐపీఎల్ సీజన్ 2022లో నేడు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగునుంది. అయితే.. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరుగనుంది. 2. నేడు రెండో రోజు జపాన్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాధినేతలతో భేటీ కానున్నారు. 3. నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు నెల కోటా టికెట్లను ఉదయం 9…
ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన బౌలింగ్ ప్రతిభతో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లోనూ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో విఫలమైనా లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడింది. సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఉమ్రాన్ మాలిక్ ఆడగా ప్రతి మ్యాచ్‌లోనూ ఫాస్టెస్ట్ డెలివరీ…