కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లు త్వరగా ఔటైనా బట్లర్ ఒక్కడే నిలబడ్డాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి చివర్లో ఔట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, యష్ దయాల్, సాయికిషోర్, హార్డిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.
Arjun Tendulkar: రంజీల్లోనూ అర్జున్ టెండూల్కర్‌కు నిరాశే..!!
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు రావడానికి కారణమైన ఏకైక ఆటగాడు బట్లర్ మాత్రమే. అతడు లీగ్ దశలో ఏకంగా మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. చివరకు కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ అతడే అదరగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ పని తేలికైంది. మరి భారీ లక్ష్యాన్ని ఈ సీజన్‌లో నంబర్‌వన్ జట్టుగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఎలా ఛేదిస్తుందో వేచి చూడాలి.