కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేటి సీబీఐ విచారణ రేపటికి ( మంగళవారం ) వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరగనుంది. ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ ను రోహిత్ రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే.. పిటిషన్ లో నలుగురుని ప్రతివాదులుగా చేర్చారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ చేపట్టింది. నేడు సిట్ ఎదుట విచారణకు అడ్వకేట్ ప్రతాప్ హాజరయ్యారు. నిందితుడు నందకుమార్, ప్రతాప్ మధ్య జరిగిన లావాదేవీలపై సిట్ విచారించనున్నట్లు సమాచారం.
ఇవాళ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాల కేసులో ఎన్ఐఏ ఎదుట విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అయితే.. పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాల ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తూ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తోందనే అభియోగాలతో నిన్న (ఆదివారం) ఎన్ఐఏ విస్తృత దాడులు నిర్వహించింది. ఈనేపథ్యంలో.. నిజామాబాద్ లో 23, హైదరాబాద్ లో 4, జగిత్యాలలో 7, నిర్మల్ లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఒక్కో ప్రాంతం,…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా ఇవాళ మొత్తం ఐదుగురు మైనర్లను కలిపి విచారణ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఘటన ఎలా జరిగింది ? అనే దానిపై ఇప్పటివరకు పోలీసులు వివరాలను సేకరించారు. విచారణలో భాగంగా మైనర్లతో పాటు కొందరు వ్యక్తులు చెప్పిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. కేసుతో ముడిపడిన సాంకేతిక, వైద్యపరమైన, శాస్త్రీయ ఆధారాలను…
ఆయుధాల అక్రమ రవాణా వ్యవహారంలో పంజాబ్ పోలీసులకు చిక్కిన ఉగ్ర అనుమానితులను తెలంగాణకు తీసుకురానున్నారు. పంజాబ్‌లోని కర్నాల్‌లో అక్కడి పోలీసులు ఈ నెల 5న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి పాకిస్థాన్‌లో ఉంటూ ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది రింధాతో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. వారిలో భూపేంద్రసింగ్, పర్మేందర్‌సింగ్‌లను విచారణ అనంతరం తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు అమన్‌దీప్ సింగ్, గురుప్రీత్ సింగ్‌లను న్యాయస్థానం అనుమతితో ఆదిలాబాద్‌కు…
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత వాదనలు వినేందుకు అంగీకారం తెలిపింది సుప్రీంకోర్టు… ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల వ్యవహారంపై తక్షణమే వాదనలు వినాలన్న అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు… గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ సీజేఐ ధర్మాసనం…
గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన పై గోపాలపురం ఏసీపీ వెంకట రమణ మాట్లాడుతూ… చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన బాధిత మహిళ ఆమె అక్క బావ తో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 4 నుండి గాంధీ ఆస్పత్రిలో బాధితురాలి బావ నరసింహులు అనే వ్యక్తి చికిత్స పొందుతున్నారు.…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల్ని పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డిలతో పాటు హోంగార్డు నాగభూషణం, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లీ అనే వ్యక్తులను విచారించారు. పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో 8 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత స్థానిక పోలీసులకు ఎలా…