MLA’s Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ చేపట్టింది. నేడు సిట్ ఎదుట విచారణకు అడ్వకేట్ ప్రతాప్ హాజరయ్యారు. నిందితుడు నందకుమార్, ప్రతాప్ మధ్య జరిగిన లావాదేవీలపై సిట్ విచారించనున్నట్లు సమాచారం. ఈ కేసులో కరీంనగర్ లాయర్ శ్రీనివాస్ ను ఏ7గా చేర్చిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. శ్రీనివాస్.. నందు, సింహయాజితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి నందుతో రూ.55 లక్షల లావాదేవీలు జరిపినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు సమాచారం.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు బృందం విచారణను ముమ్మరం చేసింది.. ఈ క్రమంలో అంబర్ పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్ గౌడ్, నందకుమార్ భార్య చిత్ర లేఖ ఇద్దరు విచారణ అధికారి ఎదుట హాజరయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు వారిని వేర్వేరు గదుల్లో 8 గంటలకు పైగా విచారించనున్నారు. నిందితుడు నందు, అతని భార్య చిత్రలేఖ, ప్రతాప్ గౌడ్ మధ్య పలు ఫోన్ మెసేజ్ లు, వాట్సాప్ చాటింగ్ లు, కాల్ రికార్డులను గుర్తించిన పోలీసులు వాటిపై ప్రతాప్ ను విచారించినట్లు సమాచారం. తొలుత తాను ఎవరితోనూ సంభాషించనని, సందేశాలు పంపలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కానీ పోలీసులు అతడి ముందు ఆధారాలు ఉంచి విచారించగా సమాధానం చెప్పకుండా ప్రతాప్ బోరున విలపించినట్లు తెలిసింది.
read also: Driverless Bus: డ్రైవర్ లేని బస్సులో చక్కర్లు కొట్టాలనుందా.. మీకోసం వచ్చేస్తున్నాయ్
నందుతో తనకున్న పరిచయం, ఇతర సంబంధాల గురించి ఆరా తీస్తే సమాధానం చెప్పకుండా దాటేశాడు. సాయంత్రం వరకు ప్రతాప్‌ను విచారించినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం కూడా విచారణకు హాజరు కావాలని విచారణ అధికారి ఆదేశించారు. అలాగే నందు భార్య చిత్ర లేఖపై ఆరా తీసిన సిట్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో ఆమెకు, ప్రతాప్‌గౌడ్, నందుక్‌ల మధ్య పలు కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు లభ్యమయ్యాయి. ఆ మెసేజ్‌లలో ఏ సమాచారం ఉంది, ఎందుకు చేశారంటూ చిత్రలేఖను ప్రశ్నించగా.. తనకు తెలియదని, గుర్తులేదు నాకు రాలేదని వింత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఆమెకు చెందిన డెక్కన్ కిచెన్, నివాసంలోని సిసి రికార్డులలో నమోదైన ఫోటోలను ఆమెకు చూపించి, వారు ఎవరు? ఎందుకు వచ్చారు? అని ఆమెను అడిగారు. అయితే తాను డైరెక్టర్‌గా ఉన్న సంస్థ కార్యకలాపాలు, లావాదేవీలపై చిత్రలేఖ దాటివేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
విచారణ నిమిత్తం 41ఏ నోటీసుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్టే తెచ్చుకోవడంతో తదుపరి ఏం చేయాలనే దానిపై సిట్ అధికారులు కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరొక నోటీసు ఇవ్వాలా? లేక డిసెంబర్ 5 వరకు వేచి చూడాలా అన్నదానిపై సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే విచారణ వేగవంతం కావడంతో రోజురోజుకు మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. నందు, రామచంద్ర భారతి, సింహయాజీ స్కాంలు బయటకు వస్తున్నాయి. కేంద్రంలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తామంటూ లక్షలు వసూలు చేశారని అధికారులు గుర్తిస్తున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి నుంచి రూ.60 లక్షలు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు.
Heart Surgery in Darkness: చీకట్లోనే చిన్నారికి గుండె చికిత్స.. వీడియో వైరల్