Terror suspects: హైదరాబాద్ ఉగ్ర కోణం.. వెలుగులోకి కేరళ స్టోరీని మించిన అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror suspects: హైదరాబాద్ ఉగ్ర కోణంలో కొత్త అంశాలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేరళ స్టోరీని మించిన అంశాలు బయటపడ్డాయి. భోపాల్ కు చెందిన ఈ యాసిర్ ఉగ్ర కోణంలో కీలక సూత్ర దారిగా పోలీసులు గుర్తించారు. యాసిర్ తను ఒక ప్లాన్ ప్రకారం ముగ్గురు హిందువులకు ఇస్లాంలోకి మార్చినట్లు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సౌరబ్ రాజ్ విద్యను మహ్మద్ సలీంగా, దేవి ప్రసాద్ పండా ను అబ్దుల్ రెహ్మాన్ గా, బస్కా వేణు కుమార్ ను మహమ్మద్ అబ్బాస్ అలీ మార్చాడు. యాసిర్ మాడ్యూస్లో లో మొత్తం 17 మంది ఉన్నట్లుగా గుర్తించి అధికారులు షాక్ తిన్నారు. భోపాల్ కు చెందిన16 మందిని హైదరాబాదులో అదుపులో తీసుకున్నారు. పరార్ లో ఉన్న సలీం కోసం గాలిస్తున్న పోలీసులు. హైదరాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టలో శిక్షణ ఇచ్చి, పూల్ తరహాలో దాడులకు ప్లాన్ వేశాడు. ఎవరికి వారే సింగిల్ గా దాడులు చేయాలని ప్లాన్ లు వేసుకున్నారు. హైదరాబాదులో కొన్నిచోట్ల డ్రోన్ ద్వారా రెక్కి చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి. యాసిర్ బృందం తుపాకులు, కత్తులు, గొడ్డలి, ఎయిర్ పిస్టల్, పిల్లోట్ ని కొనుగోలు చేసుకున్నట్లు గుర్తించారు.
Read also: TS EAMCET: నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు.. ఈ సారి కొత్త రూల్స్
Also Read
హైదరాబాదులో అరెస్టు చేసిన ఐదుగురిని భోపాల్ కు తరలించారు పోలీసులు. ఐదుగురిని ఇవాళ భోపాల్ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని తెలిపారు. హఫీజ్ బాబా నగర్ లో నివాసం ఉంటు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న మహమ్మద్ అబ్బాస్ అలీని భోపాల్ ఏటిఎస్ అరెస్టు చేసి తీసుకెళ్లారు. అబ్బాస్ అలీతోపాటు మహ్మద్ సలీం, అబ్దుల్ రెహ్మాన్, షేక్ జునైద్, మహ్మద్ హమీద్ లను ముంబై ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ అబ్బాస్ అలీ హిజ్బ్ ఉత్ తహరీర్ అనే సంస్థతో సంబంధాలు పెట్టుకున్న గుర్తించారు. ఐదుగురు కలిసి నగరంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. భోపాల్ కు చెందిన మరి కొంత మంది నగరానికి వచ్చి విధ్వంసం చేసేందుకు ప్లాన్ వేసినట్లు గుర్తించారు. పక్కా సమాచారం అందడంతో భోపాల్ ఏటిఎస్, తెలంగాణా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘా ఏర్పాటు చేశారు. అరెస్టైన వారి నుండి ఎయిర్ గన్స్, రివాల్వర్, కత్తులు, జిహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. అబ్బా సాలి అరెస్టుతో కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వారి కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైన అనుమానితులు కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన పోలీసులు.. హైదరాబాద్ లో 16 మంది.. ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో అరెస్ట్ చేయటంతో ప్రస్తుతం హైదరాబాద్ లో సంచలనంగా మారింది. దీంతో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. అసలే ఎన్నికల సమయం కావటంతో రాజకీయంగా హై ఓల్టేజీలో ఉన్నాయి పాలిటిక్స్. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ పోలీసులు.. హైదరాబాద్ వచ్చి మరీ ఐదుగురిని అరెస్ట్ చేయటం కలకలం రేపుతోంది.
Telangana 10th results: నేడే టెన్త్ రిజల్స్ .. ntvtelugu.com లో చెక్ చేసుకోండి
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?