బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయుడు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు భారత దేశాన్ని దోచుకున్న ఆంగ్లేయులకు ఇప్పుడు ఓ భారతీయుడు ప్రధాని కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేలాడుతోంది. దీంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. 2020 మే నెలలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి.
Read Also: ఘోరం: తినడానికి డబ్బులు లేక కిడ్నీలు అమ్ముకొంటున్నారట
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రధానే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బ్రిటన్‌లోని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ దిగిపోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే బోరిస్ జాన్సన్ క్షమాపణ కూడా చెప్పారు. అయినా ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో త్వరలోనే ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే.. భారత సంతతి వ్యక్తి రిషి సూనక్ ప్రధాని అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్ని సమీకరణాలు రిషి సూనక్‌కు అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
రిషి సూనక్ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్, జాన్సన్ కేబినెట్‌లో కీలక వ్యక్తి అయిన మైకేల్ గోవ్, మాజీ విదేశాంగ, ఆరోగ్య శాఖ మంత్రి జెరిమీ హంట్, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్, ఉప ప్రధాని డొమినిక్ రాబ్ ప్రధాని పదవి రేసులో ఉన్నారు. వీళ్లందరిలో రిషీ సూనక్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!