China: అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే గతంలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా, అమెరికాతో కయ్యం పెట్టుకుంది. ఇవిలా ఉంటే అన్నింటి కన్నా ముఖ్యంగా ఆ దేశాన్ని మరో సమస్య పట్టిపీడిస్తోంది. అక్కడి ప్రజలు పెళ్లిళ్లు చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు ససేమిరా అంటున్నారు. సింగిల్ గా ఉండటమే బెస్ట్ అని అలాగే కంటిన్యూ అవుతున్నారు. దీంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.
Israel–Hamas war: దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ ఇజ్రాయిల్, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్యన పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొంతకాలంగా ఆ ఘర్షణలు సద్దుమణిగినట్లు అనిపించిన మళ్లీ శనివారం ఇజ్రాయిల్ హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరు దేశాల వైపు నుండి భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇలా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో సాధారణ ప్రజలు బలైపోతున్నారు. అయితే తాజాగా ఇజ్రాయిల్ హమాస్ పైన…
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ ఆఫ్ఘన్లోని హెరాత్ ప్రావిన్సులో శనివారం 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ధాటికి ఇప్పటి వరకు 14 మంది మరణించగా.. 78 మంది గాయపడ్డారు. చాలా భవనాలు కూలిపోయాయి. కూలిన భవనాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస వివాదాలను ఎదుర్కొంటున్నాడు. ఓ వైపు సివిల్ వ్యాపారం కేసు నడుస్తుంటే మరో వైపు అమెరికా అంతర్గత రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ట్రంప్.