Hurricane Lydia: ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అదే ప్రకృతికి ఆగ్రహం వస్తే ప్రళయం సృష్టిస్తుంది. ప్రస్తుతం మెక్సికో పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. తరుచుగా సంభవిస్తున్న తీవ్ర తుఫాన్లు మెక్సికో లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తుఫాన్ల కారణంగా మెక్సికోలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ నష్టం నుండి తేరుకోక ముందే మరోసారి లిడియా హరికేన్ మెక్సికోను వణికిస్తోంది. మంగళవారం లిడియా హరికేన్ మెక్సికో దేశంలోని ఫసిఫిక్ తీరాన్ని తాకింది. కాగా మెక్సికో దేశంలోని ఫసిఫిక్ తీరంలో ఉన్న ప్యూర్టో వల్లర్టా వద్ద తుపాన్ తీరం దాటింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ లిడియా హరికేన్ తీరం దాటడంతో ఇది కేటగిరి 4 తుపానుగా మారిందని తెలిపారు.
Read also:Asifabad: ఫేక్ సర్టిఫికేట్‌తో పోలీసు ఉద్యోగాలు.. అసిఫాబాద్ లో బయటపడ్డ బాగోతం..!
లిడియా తుపాన్ లిడియా ప్యూర్టో వల్లార్టా బీచ్ రిసార్ట్ సమీపంలో తీరాన్ని తాకడం కారణంగా అతి వేగంతో గాలులు వీచాయి. దీని గురించి యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ మాట్లాడుతూ ప్యూర్టో వల్లార్టా బీచ్ రిసార్ట్ సమీపంలో తీరాన్ని తాకడంచేత గరిష్ఠంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని పేర్కొంది. ఈ తుఫాన్ కారణంగా తీవ్ర గాలులతో పాటుగా భారీ వర్షాలు కురిశాయి. దీనితో మెక్సికో దేశంఅల్లకల్లోలం అయింది. అయితే తరుచుగా సంభవిస్తున్న తుఫాన్లు మెక్సికో ఆర్ధిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.