Gaza: ప్రస్తుతం గాజా పరిస్థితి దయనీయంగా మారింది. ఒక రొట్టె కోసం గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సిన పరిస్థితి. ఆహార కొరతతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక తాజాగా ఆసుపత్రి పైన జరిగిన దాడిలో 500 మంది పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ గాజాకు అండగా నిలవనుంది. గాజాలో “స్థిరమైన” మానవతా సహాయ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈజిప్ట్ ప్రకటించింది. దీనిలో భాగంగా అవసరమైన సామాగ్రిని వందలాది ట్రక్కుల్లో గాజాకు తరలిస్తోంది ఈజిప్ట్. ఇప్పటికే…
Sumo Wrestlers: సాధారణంగా విమానాలు తన సామర్థ్యానికి సరిపడే బరువుతో మాత్రమే ఎగరగలవు. ఒక వేళ బరువు ఎక్కువైతే టేకాఫ్ సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో బరువు కారణంగా విమానాలు కుప్పకూలిన సంఘటనలు కూడా ఉన్నాయి. బరువు ఎక్కువైతే ప్రయాణికుల లగేజీని తగ్గించడమో, లేకపోతే వేరే సర్దుబాట్లు చేయటమో జరుగుతుంది.
హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు చేయడంతో తీవ్రవాద సంస్థ ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. అక్టోబరు 7 నుంచి జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తొలిసారిగా హమాస్ ఓ వీడియోను విడుదల చేసింది. బాంబు దాడిని ఆపాలనే ఉద్దేశంతో బ్లాక్ మెయిల్ చేయడం కోసం హమాస్ ఈ వీడియోను రూపొందించింది.
కిమ్ నాయకత్వంపై తిరుగుబాటు చేయడమే కాదు, చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా అత్యంత దారుణంగా చంపేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర కొరియాలో జరిగింది. తిరుగుబాటుకు పాల్పడుతున్నాడనే అనుమానంతో సైన్యంలోని ఓ జనరల్ స్థాయి అధికారిని అత్యంత పైశాచికంగా హత్య చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ దేశంలో చదువుకునేందుకు వచ్చిన పాలస్తీనా యువకులపై స్థానిక గుండాలు దాడి చేశారు. ఇద్దరిని కత్తితో గాయపరిచారు. అయితే ఈ ఘటనకు ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి సంబంధం లేదు. పంజాబ్ ప్రావిన్సులోని గుజ్రాల్ వాలా మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను స్థానిక గుండాలు వేధించారు. అయితే తమ తోటి మహిళా విద్యార్థులకు సాయంగా ఇదేమిటని ప్రశ్నించినందుకు గుండాలు కత్తితో దాడి చేశారు.
Afghanistan Earthquake: తాలిబాన్ పాలనతో పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్ఘానిస్తాన్ వరస భూకంపాలతో అల్లాడుతోంది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా భూకంప తీవ్రత నమోదైంది. గత వారం పశ్చిమ హెరాత్ ప్రావిన్సుల్లో భూకంపం వచ్చిన చోటే మరోసారి భూకంపం చోటు చేసుకుందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Plane Crashed: శనివారం నేపాల్‌లో మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ కుప్పకూలింది. వివరాలలోకి వెళ్తే. ప్రయాణికులను ఎక్కించుకోవడం కోసం ఎవరెస్ట్ బేస్ క్యాంపు సమీపం లోని లుక్లా నుంచి హెలికాప్టర్ 9N ANJ నేపాల్ లోని లోబుచే బయలుదేరింది. కాగా నేపాల్‌లోని లోబుచేలో ల్యాండ్ అయ్యే సమయంలో బోల్తా పడింది. దీనితో హెలికాప్టర్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురించి నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ నిరౌలా మాట్లాడుతూ.. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్…