Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరుస పేలుళ్లతో వణికిపోతోంది. బలూచిస్తాన్ పేలుళ్లలో 50 మందికి పైగా ప్రజలు చనిపోయిన తర్వాత మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పాకిస్తాన్ అణు కమిషన్ కార్యాలయం వద్ద పేలుడు జరిగింది.
Kenya: ఆఫ్రికా దేశం కెన్యాను మాయదారి రోగం కలవరపెడుతోంది. అసలు ఏ వ్యాధి కారణంగా బాలికలు అనారోగ్యానికి గురవుతున్నారో వైద్యులకు స్పష్టంగా తెలియడం లేదు. కెన్యాలోని దాదాపుగా 100 మంది పాఠశాల బాలికలు ఆస్పత్రిలో చేరారు. అధికారులు వారి రక్తం, మూత్రం, మలం నమూనాలను నైరోబిలోని ప్రయోగశాలకు పంపారు.
16 మంది అబ్బాయిల్ని వేధించినందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది అది కూడా ఒకటో రెండో సంవత్సరాలు కాదు. ఏకంగా 690 సంవత్సరాలు. ఈ విచిత్ర ఘటన USలో చోటు చేసుకుంది.
తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని అన్నట్లు ఉంది ఎలోన్ మస్క్ పరిస్థితి . ఎన్నో భారీ అంచనాలతో కొత్తకొత్త ఆలోచనలతో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ కి నిరాశే మిగిలింది. వివరాలలోకి వెళ్తే..
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ రాజకీయ అస్థిరత, భద్రత కారణంగా కొత్త బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులను చైనా తిరస్కరించింది.
Pakistan: ఆర్థిక, రాజకీయ అస్థిరత రాజ్యమేలుతున్న పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఈ దాడులకు ఆఫ్ఘాన్ జాతీయులు కారణం కావచ్చని పాకిస్తాన్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఆఫ్ఘన్ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 1లోగా తమ దేశంలో ఉన్న 17 లక్షల మంది ఆఫ్ఘాన్లు పాకిస్తాస్ వదిలి వెళ్లాలని హుకూం జారీ చేసింది.
రోజు రోజుకి ట్రంప్ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా మంగళవారం ట్రంప్ సివిల్ వ్యాపారం పైన న్యూయార్క్ న్యాయమూర్తి నిషేధాజ్ఞలు జారీ చేశారు.