Israel–Hamas war: దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ ఇజ్రాయిల్, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్యన పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొంతకాలంగా ఆ ఘర్షణలు సద్దుమణిగినట్లు అనిపించిన మళ్లీ శనివారం ఇజ్రాయిల్ హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరు దేశాల వైపు నుండి భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇలా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో సాధారణ ప్రజలు బలైపోతున్నారు. అయితే తాజాగా ఇజ్రాయిల్ హమాస్ పైన ప్రతీకార దాడి చేసింది. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన దాడిలో హమాస్ ఆర్థిక మంత్రి జవాద్ అబూ షమలా మరణించారు. ఈ విషయాన్నీ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ నిన్న అధికారికంగా ప్రకటించారు.
Read also:Mexico : మెక్సికో లో లిడియా హరికేన్ బీభత్సం
అలానే హమాస్ నాయకుడు జకారియా అబూ మామర్‌ను కూడా తామే చంపినట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. కాగా ఇజ్రాయెల్ హమాస్ పైన జరిపిన ఎదురుదాడిలో ఇప్పటి వరకు సుమారు 900 మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోగా, హమాస్ మిలిటెంట్లతో సహా వెయ్యి మందికి పైగా మరణించారు. ఆగని ఈ యుద్ధకాండలో అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు . హమాస్ ఆర్థిక మంత్రి జవాద్ ను చంపిన వైమానిక దళం మాట్లాడుతూ.. జవాద్ గాజా లోపల వెలుపల ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాడని, ఉగ్రవాదులకు కావాల్సిన ఆర్ధిక సహాయం ఇతనే చేసేవాడని.. అలా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ విచక్షణ రహితంగా మా దేశం పైన యుద్ధం చేసి అమాయక ప్రజల మరణాలకు కారణమైన జవాద్ ను మంగళవారం చంపేసాం అని పేర్కొన్నారు.