ఒక దేశ ప్రధాని మరో దేశంలో పర్యటిస్తున్నారంటే ఆయనకు స్వాగతం పలికే దగ్గరి నుంచి విడ్కోలు వరకు భారీ ఏర్పాట్లు చేస్తారు. ఆయన బయలుదేరుతున్నారనే సమాచారం అందగానే ఆ దేశ ప్రధానీ నుంచి పర్యాటకశాఖ మంత్రి, ముఖ్య నేతుల, అధికారులు ఎయిర్‌పోర్టు వద్ద ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారు. అలా ఇరు దేశాలు చేసే హాడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఖతార్‌లో పర్యటనకు వెళ్లిన జర్మనీ అధ్యక్షుడికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది.…
బ్యాంక్ తప్పిదం వల్ల మహిళ ఖాతాలో భారీగా నగదు నమోదైంది. వేలు, లక్షలు కాదు ఏకంగా వందల కోట్లు అకౌంట్లో జమ కావడంతో బ్యాంక్ అప్రమత్తమైంది. ఈ సంఘటన మలేషియాలో జరిగింది. మలేషియాలోని అతిపెద్ద బ్యాంక్ మేబ్యాంక్‌లో ఇలాంటి తప్పిదం జరగడం కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వచ్చాక లావాదేవిల్లో తరచూ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక లోపాల వల్ల ఖాతాలో డబ్బులు మాయమవడం లేదా జమ కావడం వంటి తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మలేషియన్…
‘ఎందుకో తెలియదు.. అమ్మకు నేనంటే ఇష్టం లేదు. నాన్న ఎప్పుడూ నాపై కోపం చూపిస్తాడు. ఆయన ప్రేమ మాట్లాడితే చూడాలని ఉంది’ అంటూ ఓ నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఇంత చిన్న వయసులోనే చిన్నారికి ఇంతటి ఆవేదనా.. అంటూ నెటిజన్ల బాధాతప్త హృదయంతో స్పందిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. సౌత్ కొరియాకు చెందిన ఈ చిన్నారి పేరు సాంగ్ ఇయో జున్. అతడు మై గోల్డెన్ కిడ్స్ అనే రియాలిటీ షో…
స్కైడైవింగ్ చేస్తూ 14వేల అడుగుల ఎత్తునుంచి కింద పడిన ఓ మహిళ విచిత్ర పరిస్థితిలో ప్రాణాలతో బయటపడింది. నిజానికి అంత ఎత్తు నుంచి పడితే బ్రతకడం అనేది అసాధ్యం. కానీ ఆమెపై దాడి చేసిన అగ్ని చీమల వల్లే ప్రాణాల నిలబడటం విచిత్రం. ఈ సంఘటన 1999లో చోటు చేసుకోగా.. ఈ విషయాన్ని రీసెంట్‌గా సదరు మహిళ మీడియాతో పంచుకుంది. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇంతకి ఏం జరిగిందంటే.. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన…
మెరికా లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుని హత్య చేసేందుకు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా(52) ప్లాన్ చేశారని అమెరికా ఆరోపిస్తూ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టులో నిఖిల్ గుప్తాపై కేసు నమోదు చేసింది.
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ను ఆదుకునేందుకు యూఏఈ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్లో యూఏఈ 20-25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కకర్ సమావేశమైన తర్వాత ఈ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.