‘ఎందుకో తెలియదు.. అమ్మకు నేనంటే ఇష్టం లేదు. నాన్న ఎప్పుడూ నాపై కోపం చూపిస్తాడు. ఆయన ప్రేమ మాట్లాడితే చూడాలని ఉంది’ అంటూ ఓ నాలుగేళ్ల చిన్నారి ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాను కదిలిస్తోంది. ఇంత చిన్న వయసులోనే చిన్నారికి ఇంతటి ఆవేదనా.. అంటూ నెటిజన్ల బాధాతప్త హృదయంతో స్పందిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. సౌత్ కొరియాకు చెందిన ఈ చిన్నారి పేరు సాంగ్ ఇయో జున్. అతడు మై గోల్డెన్ కిడ్స్ అనే రియాలిటీ షో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
Also Read: Viral Video: అడవిలో పాముతో యువకుల ఆటలు.. కేసు నమోదు?
ఈ సందర్భంగా సాంగ్‌ను తన గురించి చెప్పమనగానే.. ‘నేను ఇంట్లో ఒంటరిగా ఉంటాను. నాతో ఎవరూ ఆడుకోరు’ అని చెప్పుకొచ్చాడు. అనంతరం తన తల్లి గురించి అడగ్గా.. ‘అమ్మతో ఆడుకోవాలని ఉంటుంది. ఆమె టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. కానీ ఆమె నాకు అస్సలు టైం ఇవ్వరు. తనకి నేనంటే ఇష్టం లేదనుకుంటా’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. అనంతరం తన తండ్రితో ఉన్న అనుబంధంపై స్పందిస్తూ.. ‘నాన్ను ఎప్పుడూ నాపై కోపం చూపిస్తారు. అరుస్తుంటారు. నాన్న నన్ను ప్రేమ పిలిస్తే చూడాలని ఉంది’ అంటూ ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టాడు. ఇది చూసి అక్కడ ఉన్నవారితో పాటు చిన్నారి తల్లిదండ్రులు కూడా కన్నీరు పెట్టుకున్నారు.
Also Read: Serial killer: 6 నెలల్లో 9 మంది మహిళల హత్య.. సీరియల్ కిల్లర్ కోసం గాలింపు..
దీనిపై సాంగ్ పెరెంట్స్ స్పందిస్తూ.. తమ బిజీ లైఫ్ కారణంగా సాంగ్‌కు టైం ఇవ్వలేకపోతున్నామన్నారు. సాంగ్‌తో పాటు తమకు 6నెలల కూతురు కూడా ఉందన్నారు. తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా వారిద్దరిని పెంచడం వారికి సవాలుగా మారిందన్నారు. అందుకే ఇద్దరం జాబ్ చేస్తున్నామని, ఈ క్రమంలో సాంగ్‌తో గడిపేందుకు టైం లేదని వివరించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘నాలుగేళ్లకే ఆ చిన్నారి ఇలాంటి భవాలతో ఉండటం నిజంగా బాధాకరం, ఈ వీడియో చూస్తుటే కన్నీళ్లు ఆగడం లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
This video broke me into pieces multiple times 💔💔💔💔💔
When he tried to hold his tears 💔💔💔💔 pic.twitter.com/DHBGJBhGhv
— Anita Vams (@a__vanita) November 21, 2023