JD Vance - Usha: అమెరికా ఉపాధ్యక్షడు జేడీ వాన్స్, తన భార్య ఉషా గురించి, ఆమె హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జేడీ వాన్స్-ఉషా చిలుకూరి ప్రేమ ఆసక్తికరం అంశంగా మారిన సంగతి తెలిసిందే.
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ తన భార్య ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య ఉష ఏదో ఒక రోజు తనలాగే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌లో హత్యకు గురైన రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ జ్ఞాపకార్థం బుధవారం రాత్రి మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జె.డి. వాన్స్ మాట్లాడారు. పరస్పర గౌరవం, అవగాహనతో మతాంతర వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, గతంలో దేవుడిని నమ్మని…
Interfaith marriage: జార్ఖండ్‌కి చెందిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయిలకు సొంత రాష్ట్రంలో బెదిరింపులు ఎదురుకావడంతో కేరళ వీరి అండగా నిలిచింది. జార్ఖండ్‌కి చెందిన మహ్మద్ గాలిబ్, ఆశా వర్మలు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో వారి కుటుంబాల నుంచి పొరుగువారి నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ‘‘లవ్ జిహాద్’’కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బెదిరింపులు ఎక్కువ అయ్యాయి.
Seema Haider : సీమా హైదర్ ఈ పేరు గత కొన్నాళ్లుగా పాక్, భారత్ రెండు దేశాల్లో మార్మోగిపోతుంది. 2023లో తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశానికి వచ్చిన పాకిస్తానీ మహిళ సీమా మొదటి భర్త, తన పిల్లలను కలవడానికి, వారిని తన వద్ద ఉంచుకోవడానికి సహాయం చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
Madhya Pradesh High Court: ముస్లిం పురుషుడు, హిందూ మహిళ మధ్య వివాహం అనేది ప్రత్యేక వివాహ చట్టం కింద నమోదు చేసినప్పటికీ, ముస్లిం వ్యక్తిగత వివాహ చట్టం ప్రకారం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును చెప్పింది.
Communal clashes in Karnataka: కర్ణాటకలో మతాంతర ప్రేమ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఈ ఘటన కర్ణాటక కొప్పల్ జిల్లా హులిహైదర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే హులి హైదర్ గ్రామానికి చెందిన హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుని పారిపోయారు. దీంతో వీరిద్దరిని పోలీసులు పట్టుకువచ్చి ఇరు కుటుంబాలకు అప్పగించాయి.