Crime: ముస్లిం భార్య వివాదం.. తల్లిదండ్రుల్ని చంపి, మూడు ముక్కలు చేసిన కొడుకు..
- ముస్లిం మహిళతో వివాదం, తల్లిదండ్రులతో విభేదాలు..
- దారుణహత్యకు పాల్పడిన కొడుకు..
- పేరెంట్స్‌ను చంపి, రంపంతో కోసి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఒక వ్యక్తి ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడం దారుణమైన హత్యలకు దారి తీసింది. డబ్బు, భూ వివాదాలతో పాటు మతాంతర వివాహం వల్ల ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని క్రూరంగా హత్య చేశాడు. హత్య తర్వాత ఐదు రోజుల గాలింపు చేపట్టాక వృద్ధ దంపతుల శవాలు గురువారం దొరికాయి. సొంత కొడుకే వారిని హత్య చేసి, వారి శరీరాలను రంపంతో మూడు ముక్కలుగా కోసి, సిమెంట్ బ్యాగులో పెట్టి, స్థానికంగా ఉన్న నదిలో పారేశాడు.
నిందితుడు అంబేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో అంబేష్ కోల్‌కతాలో ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మతాంతర వివాహం కావడంతో తరుచుగా అంబేష్ తల్లిదండ్రులు ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీని వల్ల కుటుంబంలో గొడవలు ప్రారంభయ్యాయి. ఇద్దరు విడిపోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. అయితే, ఈ వివాదం నేపథ్యంలో విడిపోతే, తనకు భరణం చెల్లించాలని అతడి భార్య డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీంతో, అంబేష్ తన తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సాయం కోరాడు. దీని తర్వాత గొడవలు మరింత ముదిరాయి.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
Read Also: Sitara – Akhanda 2 : అఖండ2లో పాత్ర కోసం సితార మొదలు సూర్య కూతురి దాకా?
గత మూడు నెలల క్రితం, అంబేష్ కోల్‌కతా నుంచి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అయినప్పటికీ అంబేష్, అతడి తల్లిదండ్రుల మధ్య గొడవలు మాత్రం ఆగలేదు. దీంతో డిసెంబర్ 8న తీవ్ర వాగ్వాదం తర్వాత, అంబేష్ తన తల్లి బబితా(63) తలపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. అతడి తండ్రి శ్యామ్ బహదూర్(65) కేకలు వేయడానికి ప్రయత్నించగా, అంబేష్ అతడిని కూడా రాడ్‌తో కొట్టి తాడుతో ఉరివేసి చంపాడు. ఆ తర్వాత, మృతదేహాలను రంపంతో మూడు ముక్కలుగా కోసి ఆరు సిమెంట్ సంచుల్లో కుక్కి, కారులో వాటిని తీసుకెళ్లే గోమతి నదిలో పారేశాడు. తల్లికి చెందిన ఒక భాగాన్ని వారణాసి వైపు వెళ్తున్నప్పుడు సాయి నదిలో విసిరేశాడు.
అయితే, తన తల్లిదండ్రులు కనిపించండం లేదని, తన సోదరుడిని సంప్రదించలేకపోతున్నారని డిసెంబర్ 13న కూతురు డిసెంబర్ 13న అదృశ్యం కేసు నమోదు చేసింది. డిసెంబర్ 15న అంబేష్ ఎక్కడ ఉన్నాడో కనిపిపెట్టిన పోలీసులు, విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. గజ ఈతగాళ్లు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..