ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలపై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైంది.. కొన్నిసార్లు అసలు పరీక్షలు లేకుండానే పాస్ చేయాల్సిన పరిస్థితి తెచ్చింది.. స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ క్లాస్‌ల పేరుతో ఇంట్లోనే కూర్చొబెట్టింది.. ఇక, సిలబస్‌ను తగ్గించడం.. పరీక్షల్లో ఆప్షన్‌గా ప్రశ్నలు పెంచడం.. ఇలా అనేక మార్పులు వచ్చాయి.. కానీ, ఇప్పుడు మహమ్మారి పోయి సాధారణ పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏడాది నుంచి మళ్లీ పూర్తి…
ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా పడ్డాయి. రేపు (మే 11) జరగాల్సిన ఇంటర్ పరీక్షని ఈనెల 25కి వాయిదా వేసినట్టు అధికారులు వేసినట్టు తెలిపారు. అసని తుఫాన్ కారణంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు బోర్డ్ ప్రకటించింది. కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఈ రోజు రాత్రి…
ఏపీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరులో పెనువిషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాసేందుకు వచ్చిన సతీష్ అనే ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. గూడూరు డీఆర్‌డబ్ల్యూ పరీక్షా కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే పరీక్షా కేంద్రానికి వచ్చినప్పుడే గేటు వద్ద తనకు ఛాతిలో నొప్పిగా ఉందని అక్కడి సిబ్బందితో సతీష్ చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం పరీక్షా కేంద్రంలోని గది వద్దకు చేరుకోగా విద్యార్థి సతీష్ గుండెపోటు…
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు.. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనుండగా.. ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు.. కోవిడ్, ఎండలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్.. పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని.. ఇక, ఫలితాలు వచ్చిన…
ఏపీలో విద్యార్ధులు పరీక్షలకు రెడీ అయ్యే టైం వచ్చింది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది విద్యాశాఖ. పాత షెడ్యూళ్లను మార్చింది ఏపీ ప్రభుత్వం. దీని ప్రకారం ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే మే 6 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది పాఠశాల విద్యాశాఖ.ఉదయం 9.30 గంటల…
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మార్చాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అటు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు..…
కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్‌లు విద్యావ్యవస్థలో గందరగోళానికి గురిచేస్తాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తరహా పిటిషన్‌లు విద్యార్థులను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో క్లాసులు సరిగ్గా జరగని కారణంగా సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు టెన్త్, ఇంటర్…
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి, ఛాయిస్‌గా వదిలేసుకొనే అవకాశం కల్పించింది. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు. గత ఏడాది మూడు సెక్షన్లకు…