ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అక్టోబర్ 25 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఇంటర్ పరీక్షలకు కేవల్ 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు స్టడీ మెటీరియల్ ను ఇవాళ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షల్లో ఒత్తిడి, భయం లేకుండా ఉండేందుకే ఈ స్టడీ మెటీరియల్ ఇస్తున్నట్లు చెప్పారు.…
తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ప్రత్యక్షంగా ఇంటర్ విద్యార్థులపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు ఎంచుకున్న జూనియర్ కాలేజీలు.. ఇక్కడే ఉండటం సమస్యకు కారణమైంది. నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లోనే నాలుగు పరీక్షా కేంద్రాలున్నాయి. దీంతో ఏంచేయాలో పాలుపోక జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకు లేఖరాశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ.. హుజూరాబాద్ నియోజవర్గంలో నాలుగు ప్రభుత్వ జూనియర్…
తెలంగాణలో ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. 220 పనిదినాలతో…. రెండు టర్మ్‌లుగా అకడమిక్ ఇయర్ ఉంటుందని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 18 వరకు మొదటి టర్మ, డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 13 నుంచి 18 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది వందశాతం…
కరోనాతో గతేడాది ఇంటర్ పరీక్షలు జరగలేదు… మొదటి సంవత్సరంలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలు ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మినిమం మార్క్స్ వేసి పాస్ చేశారు. విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షలు ఆఫ్ లైన్ మోడ్ లో జరుగుతున్నాయి. దీంతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై బోర్డ్ దృష్టి…
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సుప్రీం కోర్టు లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం మినహాయించి, ఇంకో విశ్వసించదగ్గ సరైన ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. పాఠశాలలు నిర్వహించే “ఇంటర్నల్ పరీక్షల” పై ఇంటర్మీడియట్ బోర్డు కు అజమాయిషీ లేదు. కాబట్టి, “ఇంటర్నల్ పరీక్షల” ఆధారంగా సరైన రీతిలో ఖచ్చితమైన విద్యార్దుల ఉత్తీర్ణతలను నిర్ణయించలేం అని తెలిపింది. 2007, 2011 సంవత్సరాలలో (EAPCET) కామన్ ఎంట్రన్స్ పరీక్షల్లో 25 శాతం వైటేజ్…
ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై విద్యార్థులలో గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ విద్యా శాఖలో నాడు-నేడు అనే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై క్లారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సారి కూడా విద్యార్థులకు నిరాశే మిగిలింది. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వద్ద ఎలాంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. గత వారం రోజులుగా 3 వేలు మించడం లేదు. ఈ నేపథ్యంలో.. జూన్ నెలాఖరులో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని కెసిఆర్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అవకాశం ఉంటే జూన్ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని, లేని పక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకుంటున్నామని ఈ సందర్భంగా విద్యాశాఖ…
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 5 నుంచి ప్రారంభం కానున్నాయి అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 5 నుంచి 19 వరకు 98% పరీక్షలు పూర్తి అవుతాయి. 11 పని దినాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పరీక్షల సామాగ్రి అంతా ఆ యా పరీక్షా కేంద్రాలకు చేరుతున్నాయి. తూర్పుగోదావరి లో అత్యధిక, గుంటూరు లో అతి తక్కువ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. మొబైల్…