ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా పడ్డాయి. రేపు (మే 11) జరగాల్సిన ఇంటర్ పరీక్షని ఈనెల 25కి వాయిదా వేసినట్టు అధికారులు వేసినట్టు తెలిపారు. అసని తుఫాన్ కారణంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు బోర్డ్ ప్రకటించింది. కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఈ రోజు రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి జగన్నాథ కుమార్ సూచించారు. ఈ తుపాను కారణంగా మే 10న చెన్నై, విశాఖపట్నంలో పలు విమానయాన సంస్థలతో వివిధ విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఏమియేషన్ అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే.. ఇంటర్ పరీక్ష వాయిదా వేశారు.