Inter Exams: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలపై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు అన్ని సౌకర్యాలు కల్పించి పరీక్ష సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని మంత్రి సూచించారు. ఒత్తిడిని అధిగమించాలని ఆందోళన చెందొద్దని పిల్లలకు పిలుపునిచ్చారు. ప్రైవేట్ కాలేజీల్లో హల్ టికెట్స్ కి ఇబ్బంది పెడతున్నారని ఫిర్యాదులు అందాయని అన్ని జిల్లాల కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పరీక్షా కేంద్రాల్లో మంచినీటి ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. చివరి నిమిషంలో ఒత్తిడికి గురికాకుండా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిల్లలకు సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు, బందోబస్తుపై దృష్టి సారించాలని ఆదేశించారు.
Read also: Daughter harsh: సమాజం ఎటుపోతోంది.. తండ్రి ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పుపెట్టిన కన్న కూతురు..
మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు మొదలవుతాయని మొత్తం 1473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇన్విజిలేటర్స్ 26 వేల 333 మంది ఉన్నారని, పరీక్ష రాయనున్న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు 9 లక్షల 47 వేల 699 మంది ఉన్నారని అన్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4 లక్షల 82 వేల 677 మంది ఉండగా.. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నాలుగు లక్షల 65 వేల 22 మంది ఉన్నారన్నారు. ఇంటర్ బోర్డు లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని.. విద్యార్థులు వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
RRR: ఇక ఇక్కడి నుండి మరో లెక్క!