ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం మధ్యాహ్నం మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో 5,05,052 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 4,81,481 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు…
ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను కచ్చితంగా నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ రెండో వారం నుంచి నిర్వహించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షల షెడ్యూల్‌ను నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చిలోగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని సమాచారం. అలాగే ప్రీఫైనల్ పరీక్షలను ఈనెల 21 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించాలని…
తెలంగాణలో ఇంటర్ పరీక్షలను మే 2 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్తూ వచ్చిన ఇంటర్ బోర్డు.. కరోనా కారణంగా ఆఫ్‌లైన్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడం, థర్డ్ వేవ్ దృష్ట్యా మే నెలలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు మే 2న పరీక్షలను ప్రారంభించి 20వ తేదీకి పూర్తయ్యేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. మరోవైపు ఇటీవల ఇంటర్ ఫస్టియర్‌లో 2.35 లక్షల మంది విద్యార్థులు తప్పగా… ప్రభుత్వం…
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని.. ఇంటర్ ఫలితాల్లో తప్పుడు నిర్ణయాల వల్లే 23 మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఈ సారి జరిగిన ఇంటర్ పరీక్షల్లో నెలకొన్ని గందరగోళాన్ని సరిదిద్దాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు క్లాస్ రూం పాఠాలకు దూరమైన విషయం తెలిసిందేనని గుర్తు…
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ లో 70 శాతం సిలబస్ ఉండనున్నట్లు ప్రకటన చేసింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 70 శాతం సిలబస్ నుండే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. కోవిడ్ నేపథ్యం, విద్యా సంస్థలలో భౌతిక తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో 70 శాతం సిలబస్ తోనే విద్యా సంవత్సరం నిర్వహిస్తామని తెలిపింది. ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ లో ఈ సిలబస్ గురించి…
తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు అంతా సిద్ధం అయింది. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ప్రయోగాత్మకంగా మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సెంటర్ల వద్ద ప్రతి…
కరోనా కారణంగా గత సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. వారు ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ఒక…
తెలంగాణ ఇంటర్ పరీక్షల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని హైకోర్టు పిటిషన్ దారులను ప్రశ్నించింది. చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షలను ఆపలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని…
తెలంగాణ ఇంటర్ చదివే విద్యార్థులకు అలర్ట్. ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల హాల్ టికెట్స్ తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ tsbie.cgg.gov.in నుండి విద్యార్థులు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. అలా ఫొటో, సబ్జెక్టు, సంతకం ,పేరు ఇతర వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకు రావాలి అని సూచించారు. పరీక్ష ల సూపరింటెండెంట్ లు…
రేపు సాయంత్రం 5 గంటల నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల హాల్ టికెట్స్ తెలంగాణలో అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ tsbie.cgg.gov.in నుండి విద్యార్థులు నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. అలా ఫొటో, సబ్జెక్టు, సంతకం ,పేరు ఇతర వివరాలలో ఏమైనా తప్పులు ఉంటే ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకు రావాలి అని సూచించారు. పరీక్ష ల సూపరింటెండెంట్ లు హాల్ టికెట్ పై ప్రిన్సిపాల్ సంతకం…