తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు.. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనుండగా.. ఇంటర్ సెంకడ్ ఇయర్ పరీక్షలను మే 7 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు.. కోవిడ్, ఎండలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్.. పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని.. ఇక, ఫలితాలు వచ్చిన నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
Read Also: Attack On KA Paul: కేఏ పాల్‌పై దాడి.. పోలీసులపై ఫైర్..
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 9,07,400 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 1,443 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఇక, ఈ ఏడాది కూడా ఒక్క నిమిషం ఆలస్యం అయిన నో ఎంట్రీ నిబంధనల అమలు చేస్తున్నామని తెలిపారు ఉమర్ జలీల్.. పరీక్ష పత్రంలో ఛాయిస్ పెంచామని.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాలకు బస్ సౌకర్యం ఉంటుందన్నారు. మరోవైపు, జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది, మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్‌లలో ఉన్న కళాశాలలకు ఈ సారి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. నాన్ లోకల్ కాలేజీలకు షిఫ్టింగ్‌కి కూడా అనుమతి లేదని తేల్చేవారు.