CPI Narayana: సీపీఐ నారాయణకు విరిగిన రిబ్ ఎముక.. రెండు వారాలపాటు రెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే.నారాయణ స్వల్ప అనారోగ్యాన్ని గురయ్యారు. ఆయనకు పరిశీలించిన ఏఐజి డాక్టర్లు రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని సూచించారు. ఈనెల 16వ తేదీన కామారెడ్డిలో జరిగిన వివాహానికి హాజరైన సందర్భంలో వివాహ వేదిక ఎక్కుతుండగా నారాయణ జారి పడ్డారు. అయితే అప్పుడు ఆయన స్వల్పంగా గాయాలయ్యాయి. అయిన పట్టించుకోలేదు. వివాహాంలో పాల్గొన్న ఆయన మళ్లీ అక్కడి నుంచి విశాఖపట్నం మరియు చెన్నైలో జరిగిన పార్టీ సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంలో నారాయణకు రిబ్ ఎముక వద్ద నొప్పి ఎక్కువ కావడంతో డాక్టర్లను సంప్రదించారు. నారాయణను పరిశీలించిన వైద్యులు రిబ్ ఎముక విరిగినట్లు నిర్ధారించారు. నారాయణకు రెండు వారాలపాటు విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలని సూచించారు.
Read also: Chef Mantra Promo: ఇది కిచెన్ షో లాగా లేదే..మరీ ఇంత డబుల్ మీనింగ్ ప్రశ్నలా..?
Also Read
లేదంటే నొప్పి ఎక్కువ అవుతుందని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని వారి నివాసంలో నారాయణ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తను బాగానే ఉన్నట్లు తెలిపారు. రిబ్ ఎముక విరిగినట్లు వైద్యం చేయించుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు తెలిపారు. అయితే నారాయణ ఆరోగ్యం పట్లు తెలుసుకునేందుకు సీపీఐ పార్టీ నేతలు ఇంటికి క్యూ కట్టారు. నారాయణ ఆరోగ్యం పై ఆరా తీసారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. నారాయణ అందరితో బాగానే మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. భయపడాల్సిన పనిలేదని ఆయన ఆరోగ్యం కుదుట పడగానే ప్రజల్లో ముందుకు రావాలసి ఆశిస్తున్నామని అన్నారు.
West Bengal : బెంగాల్‌లో మళ్లీ రక్తపాతం.. కేంద్ర మంత్రి ఎదుటే రాళ్లు రువ్వుకున్న బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!