South Africa: లోయలో పడ్డ బస్సు.. 45మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Africa: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు ఓ బస్సు లోయలో పడింది. వంతన పై నుంచి అదుపు తప్పి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ కోసం బస్సులో 46 మంది ప్రయాణికులు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడిన తర్వాత మంటలు చెలరేగాయి. దాంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
Read Also:Tillu Square Twitter Review: టిల్లు అన్న మ్యాజిక్ రిపీటా? సినిమా హిట్టేనా?
Also Read
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
46 మందితో కూడి బస్సు బోట్స్ వానా నుంచి మోరియాకు బయలుదేరింది. ఈ క్రమంలోనే కొండపై నిర్మించిన వంతెన మలుపు వద్ద బస్సు అదుపుతప్పింది. దాంతో.. బస్సు డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయాడు. బస్సు వంతెనపై నుంచి 165 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 45 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే.. బస్సు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బస్సు లోయలో పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని అధికారులు పేర్కొన్నారు.
Read Also:Memantha Siddham Bus Yatra: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు సాగనుంది ఇలా..
ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. లింపోపోలోని ఈశాన్య ప్రావిన్స్‌లోని మమట్లకల సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వంతెనపై ఉన్న అడ్డంకులను ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడి మంటలు వ్యాపించాయని రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో పాటు.. మరికొందరు శిథిలాల లోపల చిక్కుకున్నారు. మృతుల కుటుంబాలకు ఇరుదేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు. మరోవైపు ఈస్టర్ వీకెండ్ సందర్భంగా వంతెనపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందనీ.. ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!