Emergency at Delhi airport: ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఫెడ్ ఎక్స్ విమానం పక్షి దాడికి గురైంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శనివారం ఈ ఘటన జరిగింది. విమానం 1000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే పక్షిని ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 10.46 గంటలకు టేకాప్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరారు. దీంతో విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో…
Bomb threats to Spice Jet flight: ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు విమానాన్ని క్షణ్ణంగా సోదా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. అధికారుల సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు. బాంబు బెదిరింపులతో ప్రయాణికుల బోర్డింగ్ ను ఆపి బాంబు స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారు.
ఇటీవల విమానాల్లో మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. అయితే ఈ సారి విమానంలో కాదు.. విమానాశ్రయం బయట చోటుచేసుకుంది.
Paris-bound Air India flight suffers ‘flap issue’ mid-air, returns to Delhi: ఢిల్లీ నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ఎగిరేందుకు సహాయపడే ‘ఫ్లాప్స్’లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఎయిరిండియా విమానం పారిస్ బయలుదేరింది. అయితే ప్రయాణం ప్రారంభం అయిన 35 నిమిషాల…
Malaysia-Bound Flight Delayed After Bomb Hoax At Delhi Airport: ఢిల్లీ నుంచి మలేషియా వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 173 విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికుల్లో భయాందోళన వ్యక్తం అయ్యాయి. అయితే ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ ఈ బాంబు బెదిరింపులకు కారణం అయింది. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానం దాదాపుగా మూడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటనకు కారణం…
ఇటీవల వరసగా పలు విమానాలు సాంకేతిక లోపాలతో ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. స్పైస్ జెట్ కు సంబంధించిన విమానాలు ఇటీవల కాలంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. లక్కీగా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలో జరిగింది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విస్తారా విమానం యూకే-122 సింగిల్ ఇంజిన్ తోనే ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ ఘటనలో…
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దేశంలోకి ఎదోవిధంగా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని పలు విమానాశ్రయాల్లో డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడుతున్నారు స్మగ్లర్లు. విదేశాల నుంచి అక్రమంగా ఇండియాలోకి డ్రగ్స్ ను తీసుకువస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వెస్ట్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన యువతి వద్ద నుంచి అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన యువతి వద్ద 13.26 కోట్ల…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించాలనే నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం నిలబడాల్సిన ప్రయాణీకుల కోసం విమానాశ్రయంలో కుర్చీలను వరుసగా హోల్డింగ్ ఏరియాలలో ఏర్పాటు…