Paris-bound Air India flight suffers ‘flap issue’ mid-air, returns to Delhi: ఢిల్లీ నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానం ఎగిరేందుకు సహాయపడే ‘ఫ్లాప్స్’లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఎయిరిండియా విమానం పారిస్ బయలుదేరింది. అయితే ప్రయాణం ప్రారంభం అయిన 35 నిమిషాల తర్వాత గాలిలో ఉండగానే ఎమర్జెన్సీ ప్రకటించింది. విమానం గాలిలో స్థిరంగా ఎగిరేందుకు సహకరించే ఫ్లాప్స్ లో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో విమానాన్ని తిరిగి ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రమాదసమయంలో మొత్తం విమానంలో 210 మంది ప్రయాణికులు ఉన్నారు.
Read Also: Madhya Pradesh: రేప్ కేసులో అన్యాయంగా శిక్షించారు.. రూ.10 వేల కోట్లు చెల్లించాల్సిందే..
ఎయిర్ ఇండియా బీ 787-800 ఎయిర్ క్రాఫ్ట్ వీటీ-ఎఎన్డీ, ఏఐ-143(ఢిల్లీ-పారిస్) విమానం మధ్యాహ్నం 1.28 నిమిషాలకు పారిస్ కు బయలుదేరింది. సాంకేతిక సమస్య కారణంగా మధ్యాహ్నం 2.25 గంటలకు క్షేమంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఫ్లాప్స్ విమాన రెక్కల్లో ఉంటాయి. ఫ్లైట్ లిప్ట్ కావడానికి ఇవి సహకరిస్తాయి. ఫ్లైట్ స్టాల్ అయ్యే రిస్క్ ను తప్పిస్తాయి. సాధారణంగా ఫ్లాప్స్ టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఉపయోగపడుతాయి.
అంతకుముందు డిసెంబర్ నెలలో జెడ్డా నుంచి కోజికోడ్ కు వస్తున్న స్పైస్ జెట్ విమానంలో హైడ్రాలిక్స్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. వెంటనే కొచ్చిలో అత్యవసర ల్యాండిగ్ చేశారు. గతంలో కూడా పలుమార్లు అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడి సమీప విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.