Emergency at Delhi airport: ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఫెడ్ ఎక్స్ విమానం పక్షి దాడికి గురైంది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శనివారం ఈ ఘటన జరిగింది. విమానం 1000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే పక్షిని ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం 10.46 గంటలకు టేకాప్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరారు. దీంతో విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అన్ని టెక్నికల్ పరీక్షలు జరిగిన తర్వాత మధ్యాహ్నం 1.44 గంటలకు మళ్లీ టేకాఫ్ అయింది.
Read Also: Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన జాన్వీ.. ఎవరో తెలుసా?
విమానాలు పక్షలను ఢీకొట్టడం సాధారణం అయితే ఇవి కొన్ని సందర్బాల్లో ప్రమాదకరంగా మారుతుంటాయి. ఫిబ్రవరిలో సూరత్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో పక్షిని ఢీకొట్టడంతో అహ్మదాబాద్కు మళ్లించాల్సి వచ్చింది. ఫెడ్ ఎక్స్ కార్గో విమానాలను నిర్వహిస్తుంటుంది. బర్డ్ స్ట్రైక్ తర్వాత విమానం సేఫ్ గా ల్యాండ్ చేయబడిందని ఏవియేషన్ రెగ్యలేటర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని సార్లు పక్షులను ఢీకొట్టడం వల్ల విమానం ఇంజిన్లు ఫేయిల్ అయిన ఘటనలు కూడా ఉన్నాయి.