300 Flights Delayed: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం (IGI) లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా 300కి పైగా విమానాలు నిలిచిపోయాయి.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభం అయ్యాయి.. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భద్రతా సంసిద్ధత పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులకు ఒక సలహా జారీ చేశారు.. ఢిల్లీ విమానాశ్రయ కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయి.
Bomb Threat: ఈరోజు (సోమవారం) ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించారు. విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Delhi airport bomb scare: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకి నకిలీ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. విమానంలో బాంబు పెట్టి పేల్చేస్తాంటూ ఈమెయిల్స్, అగంతకుల నుంచి ఫోన్స్ రావడం పరిపాటిగా మారింది
గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టొరంటో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు ఇమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు.
కస్టమ్స్ అధికారులమని చెప్పి సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దరు ఆగంతకులు బురిడీ కొట్టించారు. అతని వద్ద నుంచి 4.15 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
Indira Gandhi International Airport: ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరో ఘనత సాధించింది. ఇప్పటిదే దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ ఎయిర్ పోర్టు.. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 9వ స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) జాబితా ప్రకారం 5.94 కోట్లకు పైగా ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ విమానాశ్రయం 2022లో ప్రపంచంలోనే తొమ్మిదవ రద్దీగా ఉండే విమానాశ్రయంగా అవతరించింది.