New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ వాచీలను పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 28.18కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత ఖరీదైన వాచ్ లను అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రయాణికులను చెక్ చెస్తున్న క్రమంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి బ్యాగ్ ను తెరచి చూశారు. అందులో గోల్డ్ అండ్ డైమండ్స్ తో తయారు చేసిన వాచీలను అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వాచీలను ట్రాలీ బ్యాగ్ కింది భాగం లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. మొత్తం ఏడు వాచీలను ఆ ప్రయాణికుడు బ్యాగ్ లో పెట్టి తరలించే ప్రయత్నం చేశాడు. అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి వాచీలతో పాటు ఒక డైమండ్ పొందిగిన బంగారు బ్రాస్ లెట్, ఐ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ యాక్ట్ 110 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Read Also: Ind vs SA: 40 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
పట్టబడ్డ గడియారాలలో ఒకదాని ధర అత్యధికంగా ఉంటుందని అధికారుల భావిస్తున్నారు. అక్టోబర్ 4న అధికారులు సీజ్ చేయగా.. ఆ ప్రయాణికుడిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాచీల మొత్తం విలువ 28,17,97,864రూపాయలు అంటుందని అధికారులు తెలిపారు. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (APIS) ప్రొఫైలింగ్ సహాయంతో అధికారులు స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని పట్టున్నారు.
రికవరీ చేయబడిన వస్తువులు కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 110 ప్రకారం సీజ్ చేయబడ్డాయి. ప్రయాణీకుడిపై కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 104, కస్టమ్స్ చట్టం 135 కింద నాన్ బెయిలబుల్ కేసును అధికారులు పెట్టారు