Delhi Airport: ఇటీవల విమానాల్లో మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. అయితే ఈ సారి విమానంలో కాదు.. విమానాశ్రయం బయట చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంట్రీ వద్ద ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. అది గమనించిన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. జనవరి 8వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-3 డిపార్చర్ ఏరియాలోని గేట్ వద్ద మూత్ర విసర్జన చేసినందుకు 39 ఏళ్ల తాగుబోతు వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఘటన తర్వాత అతడిని గమనించిన సిబ్బంది అరెస్ట్ చేశారు. అరెస్టయిన బీహార్‌కు చెందిన జౌహర్ అలీ ఖాన్ బెయిల్‌పై అదే రోజు విడుదలయ్యారని వారు తెలిపారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3లోని డిపార్చర్ ఏరియాలోని గేట్ నంబర్-6 వద్ద ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేసినట్లు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తమకు సమాచారం అందిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
జౌహర్ అలీఖాన్.. జనవరి 8న ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మామ్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా అతను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అయితే, అప్పటికే మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జౌహార్ అలీఖాన్.. బయట కొందరు వ్యక్తులతో దుర్భాషలాడాడు. అనంతరం ఎయిర్‌పోర్టు ఎంట్రన్స్ ముందు మూత్ర విసర్జన చేశాడు. వెంటనే అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. జౌహార్ ఖాన్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పరీక్షించగా.. అతను మద్యం సేవించినట్లు తేలిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ సింగ్ తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Fight: రెండు గ్రూపుల మధ్య ఆన్‌లైన్ పోస్ట్‌ల చిచ్చు.. ముగ్గురికి కత్తిపోట్లు
ఇటీవల విమానంలో మూత్ర విసర్జన ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో సహ ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు జనవరి 4న అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం కోర్టు అతడిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.