DELHI: ఎయిర్ కెనడా విమానానికి బాంబు బెదిరింపు.. కట్ చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టొరంటో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు ఇమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) కార్యాలయానికి మంగళవారం రాత్రి 10.50 గంటలకు ఢిల్లీ-టొరంటో ఎయిర్ కెనడా విమానంలో బాంబు పెట్టినట్లు ఒక ఇమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను అనుసరించి.. సమగ్ర దర్యాప్తు, గాలింపు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
READ MORE: Lok Sabha Elections2024: జైలులో ఉండి ఎంపీలుగా విజయం.. ప్రమాణ స్వీకారం పరిస్థితేంటి?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
భద్రతా హెచ్చరికలు లేదా బెదిరింపుల కారణంగా గత కొన్ని రోజులుగా వివిధ విమానయాన సంస్థలకు చెందిన అనేక విమానాలను అత్యవసర ల్యాండింగ్‌లు చేశారు. నాలుగు రోజుల కిందట ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాస ఎయిర్ కు చెందిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలో ఒక చిన్నారి సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అహ్మదాబాద్‌కు మళ్లించిన తర్వాత, విమానం ఉదయం 10.13 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. ప్రయాణికులందరినీ విమానాశ్రయంలోకి తరలించారు. “కెప్టెన్ అవసరమైన అన్ని అత్యవసర విధానాలను అనుసరించాడు. విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసాడు. ఆకాస ఎయిర్ గ్రౌండ్‌లోని అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తోంది.” అని ఆకాస ఎయిర్ ప్రతినిధి అన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?