Drunk IndiGo Passenger Arrested For Allegedly Trying To Open Emergency Door: ఈమధ్య గాల్లో ఎగురుతున్న విమానాల్లో విచిత్ర సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాగిన మత్తులో పక్కనోళ్లపై మూత్రం పోయడమో, విమాన సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించడమో, ఎమెర్జెన్సీ డోర్ తీసేందుకు ప్రయత్నించడం వంటివి రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. తాగి తమ సీటులోనే కూర్చోకుండా, తందనాలు చేస్తున్నారు. వీరు చేసే ఆ చేష్టల కారణంగా.. ఇతర ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటుందేమోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరో తాగుబోతు కూడా ఇండిగో విమానంలో తెగ హంగామా చేశాడు. ఎమెర్జెన్సీ డోర్ తీస్తానంటూ తెగ హల్‌చల్ చేశాడు. చివరికి కెప్టెన్ రంగంలోకి దిగి.. అతని భరతం పట్టాడు. ఎయిర్‌పోర్టు రాగానే సీఐఎస్ఎఫ్ వాళ్లకు అప్పగించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Harry Brook: టెస్టులాడే వ్యక్తికి కోట్లు కుమ్మరించారు..
ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఇండిగో 6E 308 ఫ్లైట్ ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి బయలుదేరేందుకు సిద్ధమైంది. అప్పటివరకు విమానంలో వాతావరణం సజావుగానే ఉంది. ప్రయాణికులందరూ తమతమ సీట్లలో ప్రశాంతంగా కూర్చున్నారు. ఇంతలో మద్యం సేవించిన ఒక ప్యాసింజర్.. తన సీట్లో నుంచి లేచి ఎమెర్జెన్సీ డోర్ వైపుకు పరుగులు తీశాడు. అతని చేష్టలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ విమాన సిబ్బంది.. అతడ్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా తాను ‘తగ్గేదే లే’ అంటూ డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. సిబ్బంది అతడ్ని పట్టుకొని, విషయాన్ని కెప్టెన్‌కు తెలియజేశారు. అతడ్ని వెంటనే విమానంలో నుంచి దింపి, సీఐఎస్ఎఫ్ అధికారులకి అప్పగించారు. ఈ విషయంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. మద్యం మత్తులో ఒక ప్యాసింజర్ ఎమెర్జెన్సీ డోర్ తీయబోయాడని, విమానంలో ఉన్న సిబ్బంది వెంటనే కెప్టెన్‌ను అప్రమత్తం చేశారని, ఆ ప్రయాణికుడికి తగిన విధంగా హెచ్చరించారని తెలిపింది. సేఫ్టీ విషయంలో తాను రాజీ పడేదే లేదని తేల్చి చెప్పింది.
Beautiful Islands: ప్రపంచంలోని 10 అందమైన ద్వీపాలు