Delhi Airport: ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీకి చోటు.. టాప్ టెన్ 10లో ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indira Gandhi International Airport: ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరో ఘనత సాధించింది. ఇప్పటికే దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ ఎయిర్ పోర్టు.. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 9వ స్థానంలో నిలిచింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) జాబితా ప్రకారం 5.94 కోట్లకు పైగా ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ విమానాశ్రయం 2022లో ప్రపంచంలోనే తొమ్మిదవ రద్దీగా ఉండే విమానాశ్రయంగా అవతరించింది.
Read Also: Two Women Fight : మెట్రోలో కొట్టుకున్న ఇద్దరు మహిళలు
Also Read
2022లో ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాల జాబితాలో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ఏడాదికి 9.37 కోట్ల ప్రయాణికులతో అగ్రస్థానంలో ఉందని ఏసీఐ తెలిపింది. ఆ తరువాతి స్థానాల్లో డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్‌పోర్ట్ 7.34 కోట్ల ప్రయాణికులు, డెన్వర్ ఎయిర్‌పోర్ట్ (6.93 కోట్ల ప్రయాణికులు), మరియు చికాగో ఓ’హేర్ ఎయిర్‌పోర్ట్ (6.83 కోట్ల ప్రయాణికులు) ఉన్నాయి.
దుబాయ్ ఎయిర్ పోర్టు 5వ స్థానంలో, ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు 7వ స్థానంలో, లండన్ హీత్రూ విమానాశ్రయం 8వ స్థానంలో, , ఢిల్లీ ఎయిర్ పోర్టు 9వ స్థానంలో, పారిస్ చార్లెడ్ డి గల్లె ఎయిర్ పోర్టు 10వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ విమానాశ్రయం 2021లో 13వ స్థానంలో, 2019లో 17వ స్థానంలో ఉండగా.. 2022 9వ అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుగా నిలిచింది. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల నుంచి టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక విమానాశ్రయం ఢిల్లీనే. ఏసీఐ ప్రకారం గ్లోబల్ ట్రాఫిక్ లో 10 శాతానికి ఈ టాప్ 10 విమానాశ్రయాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కోవిడ్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు మామూలు స్థితికి చేరుకున్నాయి. 2022లో ప్రపంచ ప్రయాణికుల రద్దీ 7 బిలియన్లకు చేరుకుందని ఏసీఐ తెలిపింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు