Fake Customs Officials: కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి 4 లక్షలు స్వాహా చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Customs Officials: కస్టమ్స్ అధికారులమని చెప్పి సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దరు ఆగంతకులు బురిడీ కొట్టించారు. అతని వద్ద నుంచి 4.15 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సౌదీ అరేబియా నుంచి భారత్‌కు వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్ సులేమాన్‌ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన మొహమ్మద్ సులేమాన్ సౌదీ అరేబియాలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించుకునే సామాన్యుడు. చాలాకాలం తర్వాత భారత్ వచ్చిన సులేమాన్‌ను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే ఇద్దరు వ్యక్తులు బురిడీ కొట్టించారు.
Also Read: Tomato Prices: భగ్గుమంటోన్న టమాటా ధరలు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. కారణమిదే..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తమను తాము కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరూ అక్కడి నుండి అతడిని నేరుగా పార్కింగ్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే సులేమాన్ నుండి పాస్ పోర్టు సహా అన్ని వస్తువులను ఆ దుండగులు లాక్కున్నారు. అక్కడి నుంచి కారులో మహిపాల్ పూర్ వైపుగా తీసుకెళ్లి మార్గమధ్యలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆపి.. ఈ ఫోన్ ఎక్కడిది? ఈ కరెన్సీ నీకెలా వచ్చిందని ప్రశ్నించి సులేమాన్ ఫోన్ తోపాటు అతని వద్దనున్న 19000 సౌదీ రియాద్లు(4.15 లక్షలు), రూ.2000 నగదును దోచుకున్నారు.
అనంతరం నిందితులు బాధితుడిని బలవంతంగా కారు దింపేసి, తమ సీనియర్ అధికారితో తిరిగి వస్తామని చెబుతూనే వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికి గాని జరిగిందేంటో అర్ధం కాని సులేమాన్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420 (చీటింగ్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!