దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల రోజుకు వందల సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీనివల్ల కంపెనీ మూడో త్రైమాసికానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌లో భారీ ఆర్థిక నష్టం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు విమానాల రద్దు కారణంగా ఇండిగోకు సుమారు రూ. 1,800 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. డిసెంబర్ 9 వరకు టిక్కెట్ల రద్దు మూలంగా మాత్రమే ఎయిర్‌లైన్ ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగా తక్షణ నష్టాన్ని భరించింది. ఇది ప్రయాణికులకు…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళాన్ని నెటిజన్లు తమదైన శైలిలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓ నెటిజన్ ఇండిగో విమానం థీమ్‌లో రూపొందించిన ఆటో వెర్షన్‌ను AI సహాయంతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించే ఆటో నీలం, తెలుపు రంగులతో అచ్చం ఇండిగో స్టైల్‌లో రూపుదిద్దుకుంది. బయటకు విమానం రెక్కల్లా కనిపించే డిజైన్‌లు, పక్కగా ఇంజిన్‌లా స్టైల్ చేసిన…
IndiGo: భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో గత 8 రోజులుగా కొనసాగిన భారీ గందరగోళం చివరకు సమసిపోయి, సాధారణ స్థితికి వచ్చినట్లు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్స్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలకు అనుగుణంగా ఇండిగో క్రూ షెడ్యూలింగ్‌ను సరి చేయడంలో విఫలం కావడంతో సంస్థలో ఈ సంక్షోభం ఏర్పడి వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం…
IndiGo: పార్లమెంట్‌లో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇండిగోపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండిగోకి DGCA నోటీసులు జారీ చేసిందని, ప్రయాణికుల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం అని, ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని DGCAను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఇండిగో సీఈవో,…
IndiGo Crisis: ఇండిగో దేశీయ విమానాల రద్దు, ఆలస్యం ఐదవ రోజైన శనివారం కూడా కొనసాగింది. దీంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఇదే సమయంలో శనివారం ఉదయం నుంచి విమానాశ్రయాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శుక్రవారం ఎయిర్‌లైన్ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. రద్దు చేసిన అన్ని విమానాలకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇండిగో సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు, అసలు ఏంటి దీని కథ అనేది ఈ…
IndiGo chaos: 1000 పైగా విమానాలు రద్దు, డీజీసీఏ నిబంధనల్ని పాటించకుండా, ప్రభుత్వానికే సవాల్ విసిరేలా ‘‘ఇండిగో’’ ప్రవర్తించిన తీరును దేశం మొత్తం గమనిస్తోంది. లక్షలాది మంది ప్రయాణికుల అవస్థలకు కారణమైంది. డీజీసీఏ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ నిర్వహణ లోపం, మారిన నిబంధనలకు సిద్ధంగా లేకపోవడం వల్ల ఇండిగో గందరగోళం చెలరేగింది. దేశంలో అతిపెద్ద ఎయిర్‌లైనర్, మార్కెట్‌లో మెజారిటీ షేర్ కలిగిన ఇండిగో కావాలనే ఇలా తన వ్యవస్థల్ని…
విమాన ప్రయాణాల్లో 20 ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభం భారత్ ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. మునుపెన్నడూ లేని కష్టాలు ప్రయాణికులు పడుతున్నారు.
విమాన ప్రయాణం అంటేనే ఎమర్జెన్సీ ఉన్నవారే బుక్ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు.. పెళ్లిళ్లు.. సమావేశాలకు వెళ్తుంటారు. పైగా డిసెంబర్, జనవరి సీజన్ అంటేనే ఎక్కువ ప్రయాణాలుంటాయి.
IndiGo Flights Cancelling: ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. ఇవాళ్టి వరకు 1000కి పైగా విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈ క్రమంలో సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ మరోసారి స్పందిస్తూ.. ప్రయాణికులకు కలుగుతోన్న అసౌకర్యానికి క్షమాపణ తెలియజేశారు.
Indigo Crisis: ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది.