ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. అయితే రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులు, కుటుంబాల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మాత్రం సుప్రీంకోర్టు ప్రశంసించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతోందని, దానిపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని సీజేఐ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తిగానే ఉన్నాయని…
ఉక్రెయిన్ పొరుగు దేశాలకు చేరుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి వేగంగా తరలించేందుకు ముమ్మర సన్నాహాలు చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ గంగాలో భాగంగా ప్రత్యేక విమానాలు నడుపుతోంది. వచ్చే మూడు రోజులలో మొత్తం 26 విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం.
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓవైపు చర్చలు.. మరో వైపు యుద్ధం ఇలా.. రెండూ సాగుతున్నాయి.. మరోవైపు ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం.. ఉక్రెయిన్‌లో ఇంకా 15 వేల మంది భారతీయులు చిక్కుకున్నారు.. వారంతా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు తరలివస్తున్నారు.. దాడులు జరుగుతుండడంతో భయపడిపోతున్నారు.. పోలండ్‌లో భారతీయులపై అక్కడి స్థానిక పోలీసులు దాడులు చేశారు.. దీంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు మంత్రులను పంపాలని భావిస్తోంది కేంద్రం. ఉక్రెయిన్ సంక్షోభంపై…
ఉక్రెయిన్ లో చిక్కుకుని పోయిన భారతీయ విద్యార్ధులకు ఊరట లభిస్తోంది. మోడీ ప్రభుత్వం వివిధ దేశాలతో దౌత్యసంబంధాలు నెరపింది. దీంతో భారతీయ విద్యార్థులకు పోలాండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలాంటి వీసా లేకుండా భారతీయ విద్యార్థులను తమ దేశంలోకి అనుమతిస్తామని పోలాండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చే విద్యార్థులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులను ఎలాంటి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం కలిగింది. పోలాండ్…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తాం అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా యుద్ధం చేస్తోంది.. యుద్ధం ప్రారంభం కాక ముందే 4 వేల మందిని స్వదేశానికి తరలించాం.. ప్రస్తుతం గగనతలం మూసివేయడంతో 19 – 20 వేల మంది అక్కడ చిక్కుకున్నారని తెలిపారు.. అయితే, భారతీయులను ఎలా రక్షించుకోవాలని వివిధ ప్లాన్‌లను రూపొందించింది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అందరి వివరాలు సేకరించాం.. వారిని…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులకు పలు సూచనలు చేసింది భారత రాయబార కార్యాలయం… హంగేరిలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈ ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో పలు కీలక సూచనలు చేసింది సర్కార్. Read Also: Ukraine Crisis: విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను హంగేరి, రుమేనియా ద్వారా భారతీయుల తరలింపుకు కేంద్ర విదేశాంగ శాఖ…
ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న కొంత మంది విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడామని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. అక్కడ సుమారు 4 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం. నోడల్ అధికారిగా రవి శంకర్ 9871999055. ఏపీ భవన్. అంతర్జాతీయ…
ఉక్రెయిన్ – రష్యా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులకు కేంద్రం పలు సూచనలు చేసింది. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న వందలాది మంది తెలుగు విద్యార్ధులు. తల్లితండ్రులు ఆందోళనలో వున్నారు. ఉక్రెయిన్‌లో ఉండాల్సిన అవసరం లేని భారతీయ విద్యార్ధులు స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం సలహా ఇచ్చింది. ఉక్రెయిన్ లోని భారతీయ విద్యార్ధులు భారత్ దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్ లోని భారత దౌత్యకార్యాలయం…