Indian students: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ స్టూడెంట్స్ మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం లాంటి.. పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు.
పార్ట్‌టైమ్ జాబ్ ఎంత కష్టమో కెనడాలోని ఈ పరిస్థితిని చూస్తే తెలుస్తోంది. టిమ్ హోర్టన్స్ అనే ప్రసిద్ధ కాఫీ, ఫాస్ట్ ఫుడ్ షాపులో ఉద్యోగాలు వెతుక్కోవడానికి భారతీయ, విదేశీ విద్యార్థులు బారులుతీరిన దృశ్యాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలో నదిలో అయిదుగురు భారతీయ విద్యార్థులు మునిగిపోయారు. స్థానికులు అందులో ఒకరిని రక్షించారు. నలుగురు పూర్తిగా నీటిలో ముగిని మృతి చెందారు. ఈ మృతదేహాలను వీలైనంత త్వరగా వారి బంధువులకు పంపించడానికి రష్యా అధికారులతో సమన్వయం చేస్తున్నామని దేశంలోని భారతీయ మిషన్లు శుక్రవారం వెల్లడించాయి.
భారతీయ విద్యార్థులకు ఇష్టపడే గమ్యస్థానాల్లో కెనడా ఒకటి. ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీస్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) డేటా ప్రకారం.. కెనడాలోని మొత్తం 226,450 మంది భారతీయులు ఉన్నారు. ప్రతి 10 మంది విదేశీయుల్లో నలుగురు భారతీయులే ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘంటనలు భారతీయుల్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
అమెరికాలో (America) ఇటీవల వరుసగా జరిగిన ఘటనల్లో ఐదుగురు భారత విద్యార్థుల (Indian Students ) మరణాలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదని, వాటి వెనుక ఎలాంటి కుట్ర లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది
Students Died Abroad: ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో, అనారోగ్య సమస్యలతో పలువురు భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణిస్తున్నారు. తమ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు విదేశాలకు పంపుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌కి కన్నీటిని మిగులుస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్లు, దుండగుల చేతిలో మరణించడం, ఆరోగ్య సమస్యలు కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులకు ఫ్రాన్స్ అందించే తోడ్పాటు గురించి కూడా అధ్యక్షుడు ఇమాన్యయేల్ మెక్రాన్ వివరించారు.
వరుసగా మూడో ఏడాది కూడా రికార్డు స్థాయిలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. ఇటీవల విడుదలైన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ (ODR) ప్రకారం, భారతదేశం నుంచి యునైటెడ్ స్టేట్స్కు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగినట్లు తెలిసింది. 2022-23 విద్యా సంవత్సరంలో 268,923 మంది విద్యార్థులు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నారు.